తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేళ, ఆయన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.
సినీ గ్లామర్‌ను, రాజకీయ పవర్‌ను మేళవించి నిన్న జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అయితే, విజయ్ తన జీవితంలో అత్యున్నతమైన ఈ మైలురాయిని చేరుకున్న శుభతరుణంలో ఆయన భార్య సంగీత, కుమారుడు జేసన్ సంజయ్ మరియు కుమార్తె దివ్య సాషా వేదికపై ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఇలాంటి కీలక సమయాల్లో కుటుంబ సభ్యులు తోడుగా ఉండటం ఆనవాయితీ, కానీ విజయ్ విషయంలో అది జరగకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : AIADMKలో విభేదాలు తెచ్చిన విజయ్ మద్దతు !
లండన్‌లోనే సంగీత – దూరం పెరిగిందా?
విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు ఈ సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది. సంగీత ప్రస్తుతం తన పిల్లలతో కలిసి లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం ఉండటంతో పాటు, అక్కడ వారి కుటుంబ వ్యాపారాలను ఆమె చూసుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌తో తలెత్తిన విభేదాల సమయంలోనే సంగీత భర్తకు దూరంగా వెళ్లినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తన భర్తను అభినందించేందుకు కూడా ఆమె రాకపోవడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
త్రిష రాక – డేటింగ్ రూమర్స్ వైరల్
ఇదిలా ఉండగా, ఈ ప్రమాణ స్వీకార వేడుకకు దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష హాజరుకావడం మరో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా విజయ్ మరియు త్రిష డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. కుటుంబ సభ్యులు గైర్హాజరైన చోట త్రిష ప్రత్యేకంగా కనిపించడం ఈ రూమర్స్‌కు మరింత ఆజ్యం పోసినట్లయింది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే విజయ్ తన కుటుంబానికి దూరమయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన విజయ్, తన వ్యక్తిగత వివాదాలను ఎలా చక్కదిద్దుకుంటారో వేచి చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

