Ranabali movie rumors: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం 'రణబాలి' చుట్టూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
షూటింగ్ సెట్స్‌లో విజయ్ హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడని, తన వ్యక్తిగత సిబ్బంది కోసం ఏకంగా 5 నుంచి 6 కారవాన్లు, అలాగే 40-50 మంది అసిస్టెంట్లను కావాలని డిమాండ్ చేశాడంటూ ప్రచారం సాగింది. అంతేకాదు, ఈ భారీ ఖర్చులను భరించలేక విసిగిపోయిన చిత్ర నిర్మాతలు ఏకంగా 'ప్రొడ్యూసర్స్ కౌన్సిల్'ను ఆశ్రయించారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
Read Also: Tukra Ke Mera Pyar Season 2: ఓటీటీలో అలరిస్తున్న 'తుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2
Rumors about Vijay Deverakonda's 'Ranabali'… Mythri producer responds.
Ranabali movie rumors: రూమర్లపై మైత్రి నిర్మాత క్లారిటీ
ఈ తప్పుడు ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత వై. రవిశంకర్ మీడియా ద్వారా స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. విజయ్ దేవరకొండ అత్యంత ప్రొఫెషనల్‌గా వ్యవహరించే హీరో అని, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ కేవలం కొందరు కావాలనే క్రియేట్ చేసిన పుకార్లని కొట్టిపారేశారు. అటు విజయ్ పీఆర్ టీమ్ కూడా ఈ తప్పుడు రూమర్లను సృష్టించి ప్రచారం చేస్తున్న బాధ్యులపై సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
‘ది మమ్మీ’ విలన్‌తో విజయ్ ఫైట్
రూమర్ల సంగతి పక్కనబెడితే, 'రణబాలి' సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'టాక్సీవాలా', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ పాలన నాటి వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ హై-బడ్జెట్ పీరియడ్ డ్రామాను రూపొందిస్తున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ది మమ్మీ' లో విలన్‌గా మెప్పించిన నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో విజయ్‌ను ఢీకొట్టే మెయిన్ విలన్‌గా నటిస్తుండటం విశేషం.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. అంతేకాదు, వీరిద్దరి వివాహం జరిగిన తర్వాత ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం వల్ల, అభిమానుల్లో ఈ క్రేజీ కాంబినేషన్‌పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

