Dailyhunt
విజయ్ దేవరకొండతో 'బుట్టబొమ్మ' స్టెప్పులు

విజయ్ దేవరకొండతో 'బుట్టబొమ్మ' స్టెప్పులు

వార్త 2 weeks ago

Rowdy Janardhana Update: టాలీవుడ్ సెన్సేషనల్ నటుడు, విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ రవికిరణ్ కోల కాంబినేషన్‌లో వస్తున్న 'రౌడీ జనార్ధన' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ఒక హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ కోసం బుట్టబొమ్మ పూజా హెగ్డేని ఎంపిక చేసినట్లు సమాచారం.

Read Also:Vignesh Shivan about Dhanush: "ఆ బంధాన్ని కోల్పోవడం నా దురదృష్టం": విఘ్నేష్ శివన్

మాస్ సాంగ్ అప్‌డేట్

రౌడీ జనార్ధన చిత్రంలో ఇప్పటికే కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమాకు మరింత గ్లామర్ అద్దేందుకు మేకర్స్ ఒక స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారు.ఈ సాంగ్ కోసం అదిరిపోయే ట్యూన్ ఇప్పటికే సిద్ధమైందని, భారీ సెట్టింగ్‌లో షూటింగ్ జరపడానికి దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్.విజయ్ దేవరకొండ ఎనర్జీకి, పూజా హెగ్డే గ్రేస్ తోడైతే థియేటర్లలో ఈలలు పడటం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

 Pooja Hegde Special Song Rowdy Janardhana

Rowdy Janardhana Update: పూజా హెగ్డే కెరీర్ టర్న్?

ఒకప్పుడు టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డేకు గత కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో ఆమె తన కెరీర్ ప్లాన్‌ను మారుస్తున్నట్లు కనిపిస్తోంది.హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో, స్పెషల్ సాంగ్స్ ద్వారా తన డిమాండ్‌ను నిలబెట్టుకోవాలని పూజా భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.సీనియర్ హీరోయిన్ తమన్నా కూడా ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు 'కావాలా' వంటి సాంగ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడిచి 'ఐటెం సాంగ్స్ కేరాఫ్ అడ్రస్'గా మారాలని చూస్తోంది.

    Read Also hindi news: hindi.vaartha.com

    Epaper : epaper.vaartha.com

    Read Also:

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha