Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ జీవితంలో 'పరాన్నజీవులు'.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్

విజయ్ జీవితంలో 'పరాన్నజీవులు'.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్

వార్త 2 weeks ago

Singer Suchitra: ఒకప్పుడు 'సుచీలీక్స్'తో దక్షిణాది చిత్ర పరిశ్రమను వణికించిన గాయని సుచిత్ర, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె నేరుగా స్టార్ హీరోయిన్ త్రిషను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు కోలీవుడ్‌లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.

విజయ్ ఒంటరితనాన్ని కొందరు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది.

Read Also:Bandi Bhagirath case: బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన మంచు మనోజ్

విజయ్ అంటే ఇష్టం.. త్రిష అంటే అయిష్టం!

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుచిత్ర తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.”నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ విజయ్ అంటే చాలా అభిమానం. అందుకే ఏ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను. ప్రస్తుతం విజయ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలోనే ‘పరాన్నజీవుల’ (Parasites) వంటి వ్యక్తులు ఆయన జీవితంలోకి ప్రవేశిస్తున్నారు,” అని సుచిత్ర వ్యాఖ్యానించారు.

 Singer Suchitra Comments on Trisha

ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు..

విజయ్ వ్యక్తిగత జీవితంపై సుచిత్ర చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. విజయ్ తన భార్య, తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు.విజయ్ ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అతన్ని వాడుకుంటూ భారంగా మారుతున్నారని ఆమె త్రిషను పరోక్షంగా విమర్శించారు.విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో (TVK పార్టీ ద్వారా) బిజీగా ఉన్న తరుణంలో, ఆయనకు తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ వంటి వారి సలహాలు అవసరమని, లేకపోతే ఇబ్బందులు తప్పవని సుచిత్ర సూచించారు.

Singer Suchitra: విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష..

సుచిత్ర ఈ విమర్శలు చేస్తున్న సమయంలోనే, ఆదివారం చెన్నైలో జరిగిన విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ తల్లి శోభను త్రిష ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, వేడుకలో ఉద్వేగానికి లోనవ్వడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. సుచిత్ర వ్యాఖ్యలకు, త్రిష ప్రవర్తనకు మధ్య ఉన్న వ్యత్యాసంపై ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మోదీని కలిసిన తనికెళ్ల భరణి.. నా జన్మ ధన్యమంటూ భావోద్వేగం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha