Dailyhunt
విజయ్ నామినేషన్ హోల్డ్.. ఆపై ఆమోదం

విజయ్ నామినేషన్ హోల్డ్.. ఆపై ఆమోదం

వార్త 3 weeks ago

Vijay Nominations: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో దొర్లిన సాంకేతిక తప్పుల కారణంగా కొద్దిసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, సవరించిన అఫిడవిట్లను సమర్పించడంతో అధికారులు ఆయన నామినేషన్లను ఆమోదించారు.

Read Also:Kerala Elections 2026 : సీఎం రేవంత్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ పినరయి విజయన్‌

అఫిడవిట్లలో తేడాలు.. రాజకీయ రచ్చ!

విజయ్ ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన సమర్పించిన రెండు నామినేషన్ పత్రాల్లోని వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం చర్చకు దారితీసింది.ఈ తప్పులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరగడంతో విజయ్ బృందం వెంటనే స్పందించింది. ఏప్రిల్ 4న పెరంబూర్ నియోజకవర్గానికి సంబంధించిన అఫిడవిట్‌ను సవరించి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మళ్లీ సమర్పించింది.

Vijay Nominations: అభ్యంతరాలు ఉన్నా ఆమోదం

ఇందులో తన వయసును 51 ఏళ్లుగా సరిదిద్దడంతో పాటు, రెండు క్రిమినల్ కేసుల వివరాలను కూడా పొందుపరిచారు. కొళత్తూరులో నిరసన సందర్భంగా ఒక కేసు, గతేడాది మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఘర్షణకు సంబంధించి మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు.గడువులోగా తప్పులను సరిదిద్దడంతో నామినేషన్లను తిరస్కరించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. డీఎంకే, పలువురు స్వతంత్ర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రెండు చోట్లా విజయ్ నామినేషన్లను ఆమోదించారు.

 Tamil Nadu Elections 2026

విజయ్ మార్చి 30న చెన్నైలోని పెరంబూర్, ఏప్రిల్ 2న తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ రెండు అఫిడవిట్లలోని వివరాల్లో తేడాలు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుచ్చి అఫిడవిట్‌లో తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్న విజయ్, పెరంబూర్ అఫిడవిట్‌లో మాత్రం ఎలాంటి కేసులు లేవని తెలిపారు. అలాగే, వయసు విషయంలోనూ పెరంబూర్‌లో 52 ఏళ్లుగా, తిరుచ్చిలో 51 ఏళ్లుగా ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తమిళనాడు ఎన్నికల్లో 'వేల కోట్ల' అభ్యర్థిని: విజయ్ కంటే రెట్టింపు ఆస్తి.. ఎవరీ లీమా రోజ్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha