Dailyhunt
విజయ్ ప్రభంజనం.. స్టాలిన్‌కు కేసీఆర్ 'రిటర్న్ గిఫ్ట్'?

విజయ్ ప్రభంజనం.. స్టాలిన్‌కు కేసీఆర్ 'రిటర్న్ గిఫ్ట్'?

వార్త 1 week ago

Tamil Nadu Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరలేపాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) అరంగేట్రంలోనే అద్భుత ప్రదర్శన చేస్తోంది.

తాజా గణాంకాల ప్రకారం, టీవీకే ఏకంగా 110 స్థానాల్లో ముందంజలో ఉండగా, ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 67, అధికార డీఎంకే కేవలం 57 స్థానాలకే పరిమితమైంది. విజయ్ సునామీలో దశాబ్దాల కాలం నాటి ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొట్టుకుపోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే, ఈ ఫలితాలపై తెలంగాణలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తమిళనాడులో విజయ్ సాధిస్తున్న ఈ విజయం వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ఉన్నాయని గులాబీ శ్రేణులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. నాడు ఇండియా కూటమి ధర్మాన్ని పాటిస్తూ, కేసీఆర్‌తో స్నేహాన్ని కాదని ఎం.కె. స్టాలిన్ తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. డీఎంకే క్యాడర్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడం వల్లే బీఆర్ఎస్ ఓటమిపాలైందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.

Read Also : Kerala Election Results: కేరళలో రేవంత్ ప్రచారం చేసిన చోట్ల ఫలితం ఇదే!

 ‘Vijay’s’ victory in Tamil Nadu.. KCR’s return gift to Stalin..? Stalin feels the blow is too much

Tamil Nadu Election Results: విజయ్-కేసీఆర్ స్నేహం.. తెర వెనుక వ్యూహం!

తెలంగాణలో తన ఓటమికి పరోక్ష కారకుడైన స్టాలిన్‌కు తమిళనాడులో ‘చెక్’ పెట్టాలని కేసీఆర్ భావించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న విజయ్‌కు కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని, ఎన్నికల వ్యూహాలను పంచుకున్నారని టాక్. విజయ్ రాజకీయ అరంగేట్రం సమయంలో కేసీఆర్ మార్గదర్శకత్వం వహించారని, ఇప్పుడు వస్తున్న ఫలితాలే ఆ ‘రిటర్న్ గిఫ్ట్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “నాడు తెలంగాణలో కాంగ్రెస్.. నేడు తమిళనాడులో టీవీకే.. లెవెల్ అయిపోయింది స్టాలిన్” అంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.

మారిపోతున్న ద్రవిడ రాజకీయాలు

మొత్తానికి విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పుకు సంకేతం. అటు తెలంగాణలో కేసీఆర్ మద్దతుదారులు దీనిని తమ విజయంగా సంబరాలు చేసుకుంటుండగా, ఇటు తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఆత్మరక్షణలో పడింది. విజయ్ సాధించిన ఈ ‘క్లీన్ స్వీప్’ కేవలం సినిమా గ్లామర్ వల్ల వచ్చిందా లేక వెనుక ఉన్న రాజకీయ వ్యూహాల వల్ల వచ్చిందా అన్నది ఇప్పుడు విశ్లేషకుల చర్చకు దారితీస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేరళలో రేవంత్ ప్రచారం చేసిన చోట్ల ఫలితం ఇదే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha