Tamil Nadu Election Results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'తమిళగ వెట్రి కజగం' పార్టీ అనూహ్య విజయాలను నమోదు చేస్తుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించిన విజయ్‌కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also : West Bengal Elections: బ్రేకింగ్: మమతా బెనర్జీ రాజీనామా?
Congratulations from film celebrities including Vikram, Sivakarthikeyan
Tamil Nadu Election Results: శివకార్తికేయన్, జీవా, చియాన్ విక్రమ్ అభినందనలు
ప్రముఖ నటుడు చియాన్ విక్రమ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విజయ్‌ను అభినందిస్తూ ఒక హృదయపూర్వక పోస్ట్ చేశారు. “అభినందనలు మిత్రమా, నువ్వు చరిత్ర సృష్టించావ్” అని పేర్కొంటూ విజయ్ సాధించిన ఘనతను కొనియాడారు. సినిమా రంగం నుంచి వచ్చి తక్కువ సమయంలోనే ప్రజల నమ్మకాన్ని గెలవడం చిన్న విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
యువ హీరో శివకార్తికేయన్స్పందిస్తూ విజయ్ సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. “తొలి ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రభావం చూపిన విజయ్ సర్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయ్ సర్ చిత్ర పరిశ్రమకు చెందిన వారు కావడం మాకు మరింత గర్వంగా ఉంది. సినిమా రంగంలో శిఖరాలకు చేరిన ఆయన, ప్రజాసేవలో కూడా అదే స్థాయి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
మరో నటుడు జీవా వినూత్నంగా తన సంతోషాన్ని పంచుకున్నారు. టీవీకే పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ వేస్తూ ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “బ్లాస్టు బ్లాస్టు” అంటూ విజిల్ వేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

