Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెడికల్ షాపుల బంద్ కు కారణం ఏంటో తెలుసా ?

మెడికల్ షాపుల బంద్ కు కారణం ఏంటో తెలుసా ?

వార్త 4 days ago

Medical shops strike: ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి నియంత్రణ లేకుండా జరుగుతున్న మందుల విక్రయాలు, ఈ-ఫార్మసీలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు, ఫార్మసీలు నేడు బంద్‌ పాటిస్తున్నాయి.

‘ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్’ (AIOCD) పిలుపు మేరకు ఈ 24 గంటల దేశవ్యాప్త బంద్‌ను చేపట్టారు. ఈ సమ్మె లో దేశవ్యాప్తంగా 12.40 లక్షలకు పైగా ఫార్మసిస్ట్‌లు, రిటైల్ మందుల విక్రేతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు.

Read Also : Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు సెగలు.. ఢిల్లీ నిర్ణయంపైనే అందరి కళ్లు!

 Medical shops to be closed across the country today!

Medical shops strike: చట్టవిరుద్ధంగా ఆన్‌లైన్ మందుల అమ్మకాలు

ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్ మందుల విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధమని, అక్రమమని ఏఐఓసీడీ జాతీయ అధ్యక్షుడు జేఎస్ షిండే తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ‘జీఎస్ఆర్‌ 817’ నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ.. ప్రస్తుత ఆన్‌లైన్ అమ్మకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ అమ్మకాలపై ప్రభుత్వంతో జరిగిన అన్ని చర్చల్లోనూ మేము మా తీవ్ర వ్యతిరేకతను తెలిపాము. సరైన నియంత్రణ లేకపోతే ఈ ప్రాణ రక్షణ వ్యవస్థ మొత్తం మాఫియా చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించాము. ఒకవేళ ఇలాంటి డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ముందుగా దేశంలో పటిష్ఠమైన ఐటీ (IT) మౌలిక సదుపాయాలు అవసరమని ప్రభుత్వానికి సూచించాము” అని షిండే వివరించారు.

దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ జరుగుతున్నప్పటికీ, సామాన్య ప్రజలకు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర మందుల సేవలను కొనసాగిస్తామని ఏఐఓసీడీ స్పష్టమైన హామీ ఇచ్చింది. “ప్రజలకు అత్యవసర సమయాల్లో మందులు అవసరమైతే వాటిని సకాలంలో అందించడానికి మేము అంతర్గతంగా అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాము. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు” అని షిండే దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లంచం అడిగే అధికారులను పట్టిస్తే లక్ష రూపాయల రివార్డ్.. సీఎం విజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha