Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ తొలి ప్రసంగంపై డీఎంకే సీరియస్

విజయ్ తొలి ప్రసంగంపై డీఎంకే సీరియస్

వార్త 2 weeks ago

TamilNadu Politics: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, గత ప్రభుత్వం అప్పులు మిగిల్చిందని విజయ్ చేసిన ఆరోపణలపై డీఎంకే అధినేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

Read Also: CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతల స్వీకారం.. ఫోటోలు ఇవిగో

TamilNadu Politics: ఖజానా ఖాళీ అనడం సరికాదు: డీఎంకే కౌంటర్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ చేసిన వ్యాఖ్యలను డీఎంకే తప్పుబట్టింది. “రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఖజానాలో ఉన్నాయి. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని చెప్పడం అవాస్తవం. ఫిబ్రవరి బడ్జెట్‌లోనే ఆర్థిక స్థితిగతులపై మేము స్పష్టమైన వివరణ ఇచ్చాం. వాస్తవాలు తెలిసిన తర్వాతే ప్రజలకు రకరకాల హామీలు ఇచ్చారు, ఇప్పుడు నిధులు లేవనడం విడ్డూరంగా ఉంది” అని డీఎంకే నేత పేర్కొన్నారు.

 CM Vijay vs Stalin

పాలనా సామర్థ్యం ముఖ్యం.. హామీలు నెరవేర్చండి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసినప్పటికీ.. కరోనా, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని డీఎంకే గుర్తు చేసింది. “ప్రజలకు కావాల్సింది పరిపాలించే సామర్థ్యం మాత్రమే. ఓటేసిన ప్రజలను మోసం చేయకండి. ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో త్వరలోనే మెళకువలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాం” అంటూ విజయ్‌కు హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha