Dailyhunt
విజయ్ విజయం..కవిత కొత్త పార్టీకి 'పొలిటికల్ బూస్ట్'

విజయ్ విజయం..కవిత కొత్త పార్టీకి 'పొలిటికల్ బూస్ట్'

వార్త 5 days ago

Kalvakuntla Kavitha: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) కేవలం రెండేళ్ల క్రితం (2024 ఫిబ్రవరి) పార్టీ స్థాపించి, ఏలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా వందకు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి మేజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉండటం ఒక అద్భుతమని విశ్లేషకులు చెబుతున్నారు.

విజయ్ సాధించిన ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త పార్టీలకు ఒక ఆశాకిరణంగా మారింది.

విజయ్ సాధించిన ఈ భారీ విజయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి విడిపోయి ఏప్రిల్ 25న ‘తెలంగాణ రక్షణ సమితి’ (TRS) పేరిట కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవితకు ఈ ఫలితాలు పెద్ద ఊరటనిస్తున్నాయి. ‘తెలంగాణ ఆత్మ’ను కాపాడటమే లక్ష్యంగా కవిత రంగంలోకి దిగారు. కొత్త పార్టీలకు మనుగడ కష్టమని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు విజయ్ ఫలితాలు బలమైన సమాధానంగా కనిపిస్తున్నాయి.

Read Also : Tamil Nadu Election results: విజయ్ విజయంపై స్పందించిన తండ్రి చంద్రశేఖర్

Kalvakuntla Kavitha: తెలంగాణలో ‘విజయ్’ మోడల్ వర్కవుట్ అవుతుందా?

కవిత ఇప్పటికే ‘పాంచజన్యం’ పేరిట తన మేనిఫెస్టోను విడుదల చేసి, రాష్ట్రాన్ని ‘అమ్మ’గా పాలన అందిస్తానని ప్రకటించారు. గతంలో ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారం సాధించిన ఉదాహరణను ఆమె ప్రస్తావించగా, ‘కాలం మారింది’ అని విమర్శించిన వారికి విజయ్ విజయం ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

విజయ్ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని కవిత తన రాజకీయ కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్నారు. సోషల్ మీడియా ఇమేజ్ మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైతే విజయ్ లాగా అద్భుతాలు చేయొచ్చని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఈ ‘విజయ్ విక్టరీ’ కవితకు ఒక గొప్ప పొలిటికల్ బూస్ట్‌గా మారి, తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

12 రౌండ్ల పోలింగ్ తర్వాత తగ్గుతున్న మమతా బెనర్జీ ఆధిక్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha