Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయసాయి ని సజ్జల కొట్టింది నిజమే - కోటంరెడ్డి

విజయసాయి ని సజ్జల కొట్టింది నిజమే - కోటంరెడ్డి

వార్త 2 weeks ago

VSR - Sajjala : వైఎస్‌ఆర్‌సీపీ అంతర్గత విభేదాలు, గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఆధిపత్య పోరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

2022లో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి తనపై చేయి చేసుకున్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమేనని ఆయన ధ్రువీకరించారు. ఆ రోజు ప్లీనరీ వేదికపై ఎవరెవరు మాట్లాడాలనే విషయంలో వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిందని, ఆ వివాదంలోనే విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టారని విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల మధ్య ఉన్న పూడ్చలేని విభేదాలకు, అంతర్గత కలహాలకు ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని ఎమ్మెల్యే విమర్శించారు.

నెల్లూరు రాజకీయం - వైసీపీపై తీవ్ర విమర్శలు

గత సార్వత్రిక ఎన్నికల్లో విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన సమయంలో అత్యంత నీచమైన, దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కోటంరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు ప్రజలను, ప్రజాప్రతినిధులను తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తమ అహంకారాన్ని వీడటం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ రాష్ట్రంలో భయాందోళనలు, అస్థిరత సృష్టించేందుకు తీవ్ర కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయ స్వార్థంతోనే వైసీపీ అలజడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

త్వరలోనే మహిళలకు ఉచిత ఏసీ బస్సు ప్రయాణం.. సీఎం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha