Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijayasai Reddy: 'వందేమాతరం' పూర్తి గీతాన్ని పాడాల్సిందే

Vijayasai Reddy: 'వందేమాతరం' పూర్తి గీతాన్ని పాడాల్సిందే

వార్త 4 months ago

ప్పటివరకు మనం పాడుతున్న వందేమాతరం గీతం సగమేనని తెలుసా?… అయితే పూర్తి గీతం ఎలా ఉంటుందో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తన ట్వీట్ లో పంచుకున్నారు.

వందేమాతరం పూర్తి గీతాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పాడిన సగం గీతం బానిసత్వానికి నిదర్శనమని, ఈ దుస్థితిని మార్చి పూర్తి 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ సమర్థించాలని పిలుపునిచ్చారు.

విజయసాయి (Vijayasai Reddy) తన అభిప్రాయాన్ని వివరిస్తూ, విదేశీ పాలకులు వెళ్లిపోయినా, విదేశీ మతాలు మన మధ్యే మిగిలిపోయాయి. అవి మన సంస్కృతిపై పరిపాలన చేయాలని చూస్తున్నాయి. భారతదేశంలో పుట్టిన మనకు మనసు ఉండదా? ఇప్పటికీ బానిసత్వపు సంకెళ్లేనా? అని ప్రశ్నించారు.

గత 120 సంవత్సరాలుగా విదేశీ మతాల వారు ఏమనుకుంటారోనన్న భయంతోనే సగం 'వందేమాతరం' గీతాన్ని పాడామా..? అని ఆయన నిలదీశారు. మన జాతీయ గేయంలో మన అమ్మవార్ల పేర్లు ఉండకూడదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని మార్చి, పూర్తి 'వందేమాతరం' గీతాన్ని పాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని విజయసాయిరెడ్డి కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

PMO: కొత్త భవనం 'సేవా తీర్థ్‌'ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha