Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడ దసరా, ఉత్సవ్ 2.0కు సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన టీడీపీ

విజయవాడ దసరా, ఉత్సవ్ 2.0కు సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన టీడీపీ

వార్త 2 weeks ago

TDP MPs Meet Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ భేటీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు, అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.

Read Also : Telangana Fact Check: బతుకమ్మ నుంచి రూ.2,500 సాయం, రెండు తులాల బంగారం?.. TG ఫ్యాక్ట్ చెక్ స్పష్టత

 TDP invites CM Revanth to Vijayawada Dasara and Utsav 2.0.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో (ఇంద్రకీలాద్రి) దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దీనితో పాటు నగరాన్ని, స్థానిక సంస్కృతి-పర్యాటకరంగాలను ప్రమోట్ చేసేందుకు ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ను డిజైన్ చేసింది. ఈ వేడుకల కోసం కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రెండు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సహా పలువురు ప్రముఖులను కూడా టీడీపీ ఎంపీల బృందం కలసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

TDP MPs Meet Revanth Reddy: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విశేషాలు

దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుండి 20 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు అక్టోబర్ 14న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకోనున్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న తొలి భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలవనున్నారు. ఈ నెల 16న మూలానక్షత్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. విజయవాడ ఉత్సవ్ 2.0 ఈ ప్రత్యేక సాంస్కృతిక ఉత్సవాన్ని విజయవాడ నగరంలోని ఐదు ప్రధాన వేదికల్లో నిర్వహించనున్నారు.

భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు

ఈ ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 20 లక్షల మంది రాగా, ఈసారి రోజుకు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు మూడు వేర్వేరు ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గానగర్ అన్నదాన సత్రంలో భక్తులకు నిరంతర అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మిగిలిన క్యూలైన్ ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, సాంబారన్నం, పెరుగన్నం, మజ్జిగ, తాగునీటి బాటిళ్లను అందిస్తారు. వీఐపీల రాక పెరిగినప్పటికీ, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా దర్శనం అయ్యేలా పోలీసు మరియు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచే దసరా సెలవులు.. ఎన్ని రోజులు అంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha