Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచే దసరా సెలవులు.. ఎన్ని రోజులు అంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి నుంచే దసరా సెలవులు.. ఎన్ని రోజులు అంటే?

వార్త 2 weeks ago

Dasara Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల షెడ్యూల్‌ను సంబంధిత విద్యాశాఖలు అధికారికంగా ప్రకటించాయి. విద్యాసంస్థలకు దసరా పండుగ సెలవుల సమయాన్ని కేటాయిస్తూ, సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభ తేదీలను స్పష్టం చేశారు.

Read Also : Polavaram : పోలవరానికి నిధులు ఇవ్వండి..కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

 Dussehra holidays in the Telugu states begin the day after tomorrow-here is the duration.

Dasara Holidays 2026: తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల సెలవుల వివరాలు

తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుండి 22 వరకు (మొత్తం 13 రోజులు) దసరా సెలవులు అమల్లో ఉంటాయి. సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

అలాగే, రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు అక్టోబర్ 10 నుండి 21 వరకు సెలవులు ప్రకటించారు. ఇంటర్మీడియట్ కళాశాలలు అక్టోబర్ 22న పునఃప్రారంభం కానున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవుల షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుండి 21 వరకు దసరా సెలవులు నిర్ణయించారు. అయితే, అక్టోబర్ 10 (రెండో శనివారం), అక్టోబర్ 11 (ఆదివారం) వారాంతపు సెలవులు కావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే వరుసగా సెలవులు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు అక్టోబర్ 22న తిరిగి ప్రారంభం కానున్నాయి.

దసరా సెలవుల సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలు ఎలాంటి ప్రత్యేక తరగతులు (Special Classes) లేదా అదనపు బోధన కార్యక్రమాలు నిర్వహించరాదని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

ఇంటికి వెళ్లడం ఈసారి కష్టమే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha