Jogi Ramesh Case: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంలో చెలరేగిన గృహహింస, వరకట్న వేధింపుల వివాదం చట్టపరంగా తీవ్ర రూపం దాల్చింది.
తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జోగి రమేశ్ కుటుంబ సభ్యులు విజయవాడలోని మహిళా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కేసు వివరాలు మరియు అభియోగాలపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది.
Read Also :International Tiger Day: నల్లమలలో పులుల పరిరక్షణకు పవన్ కల్యాణ్ బిగ్ ప్లాన్!
కేసు నమోదు వివరాలు

జోగి రమేశ్ పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. హత్యాయత్నం (Attempt to Murder), గృహహింస (Domestic Violence), అలాగే వరకట్న నిరోధక చట్టం (Dowry Prohibition Act) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాము, సోదరి రమ సహా మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను నిందితులుగా పోలీసులు చేర్చారు.
Jogi Ramesh Case: కోర్టును ఆశ్రయించిన నిందితులు
కోడలి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో, చట్టపరమైన రక్షణ కోసం నిందితులంతా విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. జోగి రాజీవ్, జోగి రమేశ్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, రాకేశ్, పాండు, స్వామి, రమ, సాయి ఉన్నారు. పిటిషన్లపై సమగ్ర కౌంటర్ సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించడంతో తదుపరి విచారణ ఉత్కంఠగా మారింది.

