Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడలో అట్టహాసంగా జరిగిన 'పెద్ది' ప్రీ రిలీజ్.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో అట్టహాసంగా జరిగిన 'పెద్ది' ప్రీ రిలీజ్.. రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు

వార్త 5 days ago

Peddi Pre-release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక సోమవారం విజయవాడలో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Ram Charan Emotional Speech

విజయవాడ మాకు లక్కీ ప్లేస్: రామ్ చరణ్

ఈ వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడతో తమ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను గుర్తుచేసుకున్నారు. “ఇక్కడ వాతావరణం చూస్తుంటే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లా లేదు, అప్పుడే సక్సెస్ మీట్ జరుగుతున్నట్లు ఉంది. విజయవాడ మా కుటుంబానికి ఎప్పుడూ కలిసొచ్చిన నగరం. నాన్నగారి (చిరంజీవి) ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల ఫంక్షన్లు ఇక్కడే జరిగాయి. ఆ సెంటిమెంట్, లక్ కోసమే మేము ఇక్కడికి వచ్చాం” అని చరణ్ అన్నారు.

Read also: Varanasi movie: హైదరాబాద్‌లో ఐమాక్స్ కమ్‌బ్యాక్.. ఏఎంబీ సినిమాస్‌లో వారణాసి సందడి!

Peddi Pre-release Event: పదేళ్లకొకసారి వచ్చే అద్భుతమైన కథ ‘పెద్ది’

సినిమా కథ గురించి చరణ్ ఎమోషనల్ అయ్యారు.

“ఒక యాక్టర్‌గా ఎన్నో కథలు వింటుంటాం. కానీ ‘పెద్ది’ కథ నా గుండెకు హత్తుకుపోయింది. ఇది పదేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఒక అద్భుతమైన కథ. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ తర్వాత నేను అంతలా ఇష్టపడి, ప్రతిరోజూ షూటింగ్‌కు ఎప్పుడు వెళ్దామా అని ఆరాటపడి చేసిన సినిమా ఇదే. నా సినీ కెరీర్ లైబ్రరీలో ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది.” ఈ కథను అందించినందుకు బుచ్చిబాబు గురువు సుకుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం పైకి ఎదిగే మనిషి కథ కాదని, కింద పడిపోయిన వాడు తన ఆత్మగౌరవంతో తిరిగి ఎలా లేచి నిలబడ్డాడనేదే ‘పెద్ది’ అని స్పష్టం చేశారు.

బుచ్చిబాబు ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు!

దర్శకుడు బుచ్చిబాబు సానాపై చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. “బుచ్చిబాబు ఆలోచనా విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో ఇండియాలోనే టాప్-3 లేదా టాప్-4 దర్శకులలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది” అని జోస్యం చెప్పారు.

అభిమానుల గురించి మాట్లాడుతూ.. “చిరంజీవి గారి కొడుకుగా, కల్యాణ్ బాబాయ్ అబ్బాయిగా పుట్టిన నాకు సినిమా తప్ప మరేమీ తెలియదు. మీకోసం రక్తం చిందించడానికైనా నేను సిద్ధం. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను” అని అనడంతో స్టేడియం దద్దరిల్లింది.

జాన్వీ కపూర్ ‘చంద్రుడిలో ముక్క’ లాంటిది..

చిత్రబృందం గురించి చరణ్ మాట్లాడుతూ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు పెద్ద పిల్లర్ అని కొనియాడారు. హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి చెబుతూ.. “ఆమెను చూస్తుంటే చంద్రుడిలో ముక్క జారి నా పక్కన పడినట్లు ఉంది. జాన్వీ నటన చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వపడతారు. ఆమె తన తల్లి కంటే పెద్ద హీరోయిన్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. అలాగే నిర్మాత సతీష్ కిలారు అనుభవమున్న నిర్మాతలా ప్రతిరోజూ సెట్స్‌లోనే ఉండి సినిమాను నిర్మించారని అభినందించారు.

చరణ్ గారి నటన చూసి థియేటర్లలో కన్నీళ్లు వస్తాయి: బుచ్చిబాబు

దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. “ఉప్పెన తర్వాత ఐదేళ్లకు ఈ సినిమా చేస్తున్నాను. చాలా టెన్షన్‌గా ఉంది. ‘పెద్ది’ కేవలం కమర్షియల్ సినిమా కాదు.. ఒక ఆటగాడి ఆత్మగౌరవ పోరాటం. ఒక నిజాయితీ గల కథను, రామ్ చరణ్ లాంటి నిజాయితీ ఉన్న హీరో నమ్మి చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది” అన్నారు.

సినిమా సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు చరణ్ గారి నటన చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారని బుచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు. జగపతిబాబు పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర కూడా అందరినీ కదిలిస్తుందన్నారు. జూన్ 4న ఈ సినిమాను కుటుంబంతో కలిసి థియేటర్లలో చూడాలని ఆయన కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

విజయ్ అభిమానుల ట్రోలింగ్.. బిడ్డను కోల్పోయానన్న జూలీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha