Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు విజయసాయిరెడ్డి బెస్ట్ విషెస్ - రెండు కీలక సలహాలు

విజయ్‌కు విజయసాయిరెడ్డి బెస్ట్ విషెస్ - రెండు కీలక సలహాలు

వార్త 1 month ago

Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు కైవసం చేసుకోవడంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

ఈ విజయం తమిళనాడు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల తీరుతో విసుగు చెందిన ప్రజలు, ముఖ్యంగా యువ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపారని ఆయన విశ్లేషించారు. విజయ్ కున్న సినీ పాపులారిటీ కూడా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

Read Also: TVK Vijay Convoy Video: ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో విజయ్ ఎంట్రీ - వీడియో వైరల్

సలహా 1: సమర్థవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి

ప్రజలు అందించిన ఈ అపూర్వ విజయాన్ని సుపరిపాలనగా (Good Governance) మార్చాలంటే విజయ్ ముందుగా ఒక బలమైన పునాదిని నిర్మించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు. రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు, పాలనాపరమైన విషయాల్లో పట్టున్న సమర్థులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని (Core Team) ఏర్పాటు చేసుకోవడం విజయ్ ప్రాథమిక కర్తవ్యమని ఆయన అన్నారు. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత, వేగవంతమైన అమలు సాధ్యమవుతుందని తెలిపారు.

Vijay TVK: సలహా 2: పొత్తులపై ఆచితూచి అడుగులు

ప్రస్తుతం టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు 10 స్థానాల దూరంలో ఉండటంతో ఇతర పార్టీల మద్దతు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో పొత్తులపై విజయసాయిరెడ్డి కీలక సలహా ఇచ్చారు. కేవలం అధికారం కోసమే కాకుండా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు,వాగ్దానాలను అమలు చేయడంలో నిజాయితీగా సహకరించే పార్టీతోనే చేతులు కలపాలని విజయ్‌కు సూచించారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా సాగే పొత్తు మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని అందించగలదని ఆయన ట్వీట్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి.. సంతాపం వ్యక్తం చేసిన నారా లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha