TVK Vijay Convoy Video: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
ఎల్లుండి (మే 7) ఆయన బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో, అధికారులు ఇప్పటికే విజయ్‌కు ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన కోసం భారీ కాన్వాయ్‌ను, ప్రత్యేక సెక్యూరిటీ బలగాలను కేటాయించారు.
Read Also:SBI : సమ్మె బాట పట్టబోతున్న SBI ఉద్యోగులు !!
అభిమానుల కోలాహలం.. వీడియో వైరల్
విజయ్ తన నివాసానికి చేరుకుంటున్న సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి సందడి చేశారు. తమ అభిమాన నటుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే ఆనందంతో అభిమానులు నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో విజయ్ తన కారు అద్దాన్ని దించి, చిరునవ్వుతో అభిమానులకు అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
TVK Vijay Convoy Video: నెహ్రూ స్టేడియంలో చారిత్రాత్మక ఘట్టం
చెన్నైలోని నెహ్రూ స్టేడియం ఈ చారిత్రాత్మక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక కానుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరుగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కేవలం 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, ఇతర పార్టీల మద్దతుతో అధికారాన్ని చేపట్టబోతోంది. రేపు విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా లేఖ అందించనున్నారు. అటు సినిమా రంగంలో ఆయన చివరి చిత్రం 'జన నాయకన్' కూడా త్వరలోనే విడుదల కాబోతుండటంతో, అటు రాజకీయంగా.. ఇటు సినీ పరంగా విజయ్ పేరు మారుమోగుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
టీవీకే ఎమ్మెల్యేగా తెలుగు మహిళా సంచలనం

