Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు వీసీకే జై.. టీవీకే బలం 118!

విజయ్‌కు వీసీకే జై.. టీవీకే బలం 118!

వార్త 2 weeks ago

VCK Support Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వీసీకే (VCK) పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా మద్దతు లేఖను షేర్ చేసింది. వీసీకే మద్దతుతో ప్రస్తుతం విజయ్ కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ దాటి 118కి చేరుకుంది.

Read Also:TVK Vijay : విజయ్ సీఎం కావాలంటూ ఆందోళన.. రోడ్డుపై ఘర్షణలు

VCK Support Vijay: ట్విస్టుల మధ్య వీసీకే నిర్ణయం

నిన్నటి వరకు మద్దతు విషయంపై మౌనంగా ఉన్న వీసీకే, నేడు నాటకీయ పరిణామాల మధ్య తన నిర్ణయాన్ని ప్రకటించింది. తొలుత టీవీకే ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు, వాటికి విజయ్ అంగీకరించకపోవడంతో వీసీకే వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా కాసేపటికే మద్దతు లేఖను టీవీకే కార్యాలయానికి ఈమెయిల్ చేసినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎక్స్ వేదికగా తమ పార్టీ అధినేత, టీవీకే చీఫ్‌తో చేయి కలుపుతున్నట్లుగా ఉన్న ఏఐ చిత్రాన్ని షేర్ చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చివరి నిమిషంలో విజయ్ కి షాక్ ..రేపు ప్రమాణ స్వీకారం లేనట్లేనా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha