TVK Vijay : తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను ముఖ్యమంత్రిగా ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు మైలదుతురైలో ఆందోళనకు దిగారు.
ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసి చివరకు ఘర్షణగా మారింది.
కాంగ్రెస్ నాయకులు విజయ్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న డీఎంకే కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువర్గాల మధ్య మొదట వాగ్వాదం చోటుచేసుకోగా, తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Read ALso : TVK విజయ్ విజయం వెనుక ప్రధాన సూత్రధారి అతడే !!
ధర్నా ముగించుకుని కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా, కొందరు డీఎంకే కార్యకర్తలు (TVK Vijay) వారిని వెంటాడి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెండాలను లాక్కొని రోడ్డుపై పడేయడం, కార్యకర్తలను తోసిపుచ్చడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోల్లో కార్యకర్తలు ఒకరినొకరు వెంటాడుతూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఇంకా అధికారికంగా పోలీసులు స్పందించలేదు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశం చుట్టూ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఇలాంటి ఘటనలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
త్వరలో స్థానిక ఎన్నికలు.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

