Value-based Education : ఒక దేశం అన్ని రకాల ప్రగతి ఆ దేశ విలువల వ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశ సాంఘిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధిలన్నీ ఆ దేశ 'విలువల విద్యపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
చరిత్ర కూడా ఇదే చెబు తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ సర్వ నాశనమయినాయి. జపాన్లోని హిరోషిమా నాగసాకి పట్టణా లు ఆటంబాంబులకు గురి అవ్వగా జర్మనీ తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీగా విడగొట్టబడింది. కానీ ఆ రెండు దేశాలు అనుసరించిన ‘సామాజిక బాధ్యత విలువల’ వలన కేవలం రెండు దశాబ్దాలలోనే అవి రెండు అభివృద్ధి చెందాయి. అదే విధంగా 1948లో ఏర్పడిన తక్కువ జనాభాగా ఉన్న ఇజ్రాయిల్ దేశం సైతం రెండు దశాబ్దాలు వ్యవధిలోనే చాలా శక్తివంతమైన దేశంగా మారించింది. దీనికి కారణం ఆ దేశ ప్రజలు అనుసరించిన ‘విలువలతో కూడిన అంకితభావం’. చరిత్ర చెబుతున్న అలాంటి విలువలు నేడు మన దేశంలో కనబడుతున్నాయా అని అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది.
Value-based Education
Value-based Education : పాఠశాల విద్యార్థి దశ
వాస్త వానికి నేడు మన సమాజంలో కుటుంబం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, మీడియా, సోషల్ మీడియా లాంటి వ్యవస్థలలో విలువల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ విలువల సంక్షోభం నుండి బయటపడే మార్గాన్ని నేడు మనం సవాళ్లుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ విలు వలను పాఠశాల విద్యార్థి దశ నుండే అనుసరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. విద్యార్థి దశ నుండే ‘విలువల తో కూడిన విద్యను’ గురువులు అందించేందుకు సంసిద్ధం గా ఉన్నప్పటికీ, ప్రస్తుత కాలం తల్లిదండ్రుల సహకారం గురువులకు అందడం లేదనేది సత్యవాక్కు. నేటి తల్లిదండ్రు లు తమ బిడ్డలను విద్యాసంస్థలలో చేర్పించుతున్న సంద ర్భంలో గురువులను మార్కులు, ర్యాంకులు మాత్రమే అడుగుతున్నారు కానీ మంచి విలువలను నేర్పించండి అని అడగడం లేదు. వాళ్ళు మార్కులు, ర్యాంకులు మాత్రమే తమ పిల్లల భవిష్యత్తు అనే భ్రమలో నుండి బయటపడా ల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే స్వతంత్య్రం వచ్చే నాటికంటే నేడు మన దేశ అక్షరాస్యత రేటు సుమా రుగా 80 శాతం ఉన్నప్పటికీ విద్యావంతులతో పాటు అవి నీతి పరుల రేటు కూడా పెరుగుతున్నది అని కొన్ని సర్వేల ప్రకారం తెలుస్తుంది. అవినీతి గల దేశాల జాబితాలో మన దేశం రేటు కూడా పెరిగింది కదా! అనగా విలువలతో కూడిన విద్యను బోధించకుండా తల్లిదండ్రుల కోరిక మేరకు కేవలం మార్కులు, ర్యాంకుల కోసం మాత్రమే బోధన జరు గుతుంది కాబట్టి అక్కడ విలువల బోధన లేనందున అక్ష రాస్యతతో పాటు అవినీతి కూడా పెరిగినట్టే కదా! కాబట్టి ప్రస్తుత అకాడమిక్ సంవత్సరాన్ని పురస్కరించుకొని తరగ తులు ప్రారంభ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు గురువులను మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా మంచి విలువలను నేర్పించగలరని అడగటం చేస్తే అది దేశ భవిష్యత్తుకు మంచిప్రణాళికగా భావించవచ్చనే అభిప్రాయం కలుగుతుంది.
తల్లిదండ్రులకు ఈ విలువల విద్య బోధించాలేమో..
గత అమెరికా అధ్యక్షుడు ఇదే విధా నాన్ని అనుసరించారు. మా బిడ్డలను తమరి చేతులలో ఉంచు తున్నందున మంచి ‘విలువలతో కూడిన విద్యను’ బోధించం డనీ వారి గురువులను కోరారు. ఉచితంగా లభించే వంద రూపాయల కంటే కష్టపడి సంపాదించే ఒకరూపాయి విలు వైనదని, ఓటమిని తట్టుకోవడం గెలుపును ఆస్వాదించటం, అసూయద్వేషాలకు దూరంగా ఉంచడం, ప్రకృతిని ప్రేమించ డం మోసంతో వచ్చే గెలుపు విజయం కాదని ‘విలువలతో కూడిన విద్యను’ మా బిడ్డలకు నేర్పించగలరని గురువులను కోరడం జరిగింది. విద్యార్థుల కంటే తల్లిదండ్రులకు ఈ విలువల విద్య బోధించాలేమో అనే ఆలోచనలను కొన్ని సందర్భాలను గమనిస్తుంటే అనిపిస్తుంటుందని విద్యావేత్తలు వాపోతున్నారు. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదని ఈ సమాజంలోని తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉన్నది. నీవు నీతిలేని విద్యను బోధిస్తున్నావు అంటే తెలివిగల దయ్యాలను తయారు చేస్తున్నారని అర్థం’ అని విలువల్లేని విద్యగురించి అంటారు డ్యూక్ ఆఫ్ వెల్డింగ్టన్. ఒక సమాజం ఆమోదించి, అంగీకరించిన ఆదర్శాలు, నియ మాలు, ప్రవర్తనలనే ‘విలువలు’ అంటారు. మంచి విలువలు గల వ్యక్తుల వలనే మంచి సమాజ నిర్మాణం అవుతుంది. అదే మన దేశ భవిష్యత్తు, విలువలను విద్యారూపంలో బోధన ద్వారా పెంపొందించటం ఒక విధానమైతే ఆదర్శ ప్రాయులు వాటిని అనుసరణీయం ద్వారా సమాజానికి నేర్పించగలగడం అనేది మరో గొప్ప విధానం.
Value-based Education
కుటుంబ విలువలు
కుటుంబ పెద్ద ద్వారా కుటుంబ విలువలు, సమాజంలోని పెద్దల ద్వారా సామాజిక విలువలు, రాజకీయ నాయకుల ద్వారా రాజకీయ విలువలు, స్వీయనియంతృత్వ విలువలను మీడియా, సోషల్ మీడియా వారు అనుసరించి నిరూ పించగలిగితే తదనంతరం వచ్చేవివిధ వ్యవస్థలలోని తరానికి మార్గ దర్శకులవుతారు. ‘కుటుంబ విలువల’ విష యానికి వస్తే ‘నాకు గొప్పతల్లిని ఇవ్వండి నేను గొప్పజాతిని ఇస్తాను’ అని అంటారు నెపోలి యన్. అంటే మంచి విలు వలను పాటించే తల్లిదండ్రుల వలనవారిని చూసి అనుస రించే వారి బిడ్డలు అదేవిధంగా మంచి విలువలతో పెరిగి జాతి నిర్మాణంలో భాగస్వాములు కాగలరు. ఇలాంటి విలు వలు బోధన ద్వారా కాకుండా కుటుంబ పెద్దలను చూసి అనుసరించి నేర్చుకునే విలువలు ఇవి. నేటి సమాజంలో రాజకీయ విలువల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రస్తుత నాయకులు మంచి విలువలు గల రాజకీయ విధానాన్ని అనుసరించగలిగితే తర్వాతతరం వారికి ఇది ఆదర్శప్రాయం గా ఉండగలుగుతుంది. రాజకీయ విలువలు అనుసరించే వారిని చూసి ఆచరణ ద్వారా నేర్చుకోగల ఈ రాజకీయ విలువలు యువ రాజకీయ నాయకులకోసం ఇది అత్యంత అవసర మైనది. ఉదా హరణకు.. 1965 సంవత్సరంలో పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. దీనికి ప్రతిగా భారత్ జవాబు మాత్రమే చెబుతుంది. ఈ సందర్భంలో అమెరికా భారత్ పై ఒత్తిడి చేస్తూ యుద్ధం ఆపేయాలని లేనిచో భారత్ కు సరఫరా చేయవలసిన ధాన్యాన్ని ఆపేస్తామని బెదిరింపులు చేస్తున్న సందర్భం అది. వాస్తవానికి భారత్ పాక్కు జవాబు మాత్రమేఇస్తుంది.
గురువుల సహకారంతో
ఇది “స్వాభిమానసమస్య. ఆ సందర్భంగా దేశ ప్రధాని అయిన లాల్ బహుదూర్ శాస్త్రి దేశ ప్రజలకు ఒక పూట భోజనం మానేయండి అనే సందేశం ఇవ్వాల్సివచ్చిన పిమ్మట, ముందు రోజు అనగా ఆదివారం సాయంకాలం తన ఇంటిలో భోజనం వండనీయ కుండా తను వారి పిల్లలతో పాటు ఉపవాసం చేయాల్సి వచ్చింది. వారు, వారి పిల్లల ఉపవాస ప్రయోగ ప్రోత్సాహం తో మరుసటి రోజు సోమవారం జాతినీ ఉద్దేశించి ఒక పూట ఉపవాస మంత్రాన్ని దేశ ప్రజలు పాటించాల్సిఉందని పిలుపునిస్తూ జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారు. నేడు భారత్ ఇలాంటి ‘విలువలతో కూడిన రాజకీయాన్ని’ కోరుకుంటుంది. ఈ విధానాలు బోధనతో మాత్రమే కాకుండా ‘విలువలు కలిగిన నాయకులను’ అనుసరించటం ద్వారా నేర్చుకునే రాజకీయ విలువలు ఇది. సుప్రీంకోర్టు 2002 ఇచ్చిన తీర్పులో విద్యార్థులకు “విలువలతో కూడిన విద్య” అందించేందు కు అన్ని మతాలలోని మానవతా విలువలను విద్యార్థులకు బోధించాలని వ్యక్తులు ఉన్నతులు కా వాలంటే ‘విలువల బోధన అవసరమని స్పష్టంగా తెలి పింది. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల స్థాయి నుండే ‘విలువల విద్య’ అవసరమని భావించి గురువుల సహకారంతో మంచి విలువల విద్య విధానాన్ని మొదటి తరగతి నుండి నేర్పించేందుకు తగువిధంగా సమాయాత్తమై ఉన్నదానేది చాలా గొప్ప విషయంగా భావించవచ్చు.
-వి వి రమణ నాయక్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

