Hyderabad Metro: భాగ్యనగరంలో జరుగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు తీపి కబురు అందించారు. సెప్టెంబర్ 25, శనివారం నాటి నిమజ్జనం వేడుకల రద్దీని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి వరకు ప్రత్యేకంగా మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి 1:00 గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Read Also : Traffic Restrictions For Ganesh Immersion : హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం: ట్రాఫిక్ ఆంక్షలు
Good news for Metro passengers during the Vinayaka immersion.
Hyderabad Metro: చివరి రైలు సమయం, స్టేషన్ల వద్ద భద్రతా ఏర్పాట్లు
చివరి మెట్రో రైళ్లు రాత్రి 1:00 గంటకు తమ గమ్యస్థానంలోని చివరి స్టేషన్‌కు చేరుకునేలా ఈ ప్రత్యేక సర్వీసులను ప్లాన్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా నిమజ్జనానికి భారీగా భక్తులు తరలివచ్చే ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసు సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ బలగాలను మోహరించారు. భక్తుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
అదనపు రైళ్లు, టికెట్ కౌంటర్లు
రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల క్యూ లైన్లను నివారించడానికి అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, డిమాండ్ మరియు రద్దీ స్థాయిలను బట్టి అవసరమైన మార్గాల్లో అదనపు రైళ్లను కూడా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నిమజ్జన రోజున అర్ధరాత్రి వరకు సేవలు అందించిన అనంతరం, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 26 ఉదయం 6:00 గంటల నుంచి మెట్రో రైళ్లు యథావిధిగా, సాధారణ సమయాల ప్రకారం నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం స్పష్టం చేసింది.

