Vinesh Phogat Anti-Doping: భారత రెజ్లింగ్ రంగంలో మరోసారి కలకలం రేగుతోంది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. క్రమశిక్షణారాహిత్యం, యాంటీ-డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆమెకు 15 పేజీల షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఈ నోటీసుకు 14 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Read Also:Sanju Samson: CSK కెప్టెన్సీ రూమర్లపై నోరు విప్పిన సంజూ..
Vinesh Phogat
నిషేధానికి ప్రధాన కారణాలు
WFI జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, వినేష్ ఫోగట్ ఈ క్రింది నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.
- యాంటీ-డోపింగ్ రూల్స్: రిటైర్మెంట్ నుండి తిరిగి వచ్చే అథ్లెట్లు ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్’ (UWW) నిబంధనల ప్రకారం కనీసం ఆరు నెలల నోటీస్ కాలాన్ని పూర్తి చేయాలి. వినేష్ ఈ గడువును పాటించలేదని సమాఖ్య తెలిపింది.
- క్రమశిక్షణారాహిత్యం: వినేష్ ప్రవర్తన దేశానికి ఇబ్బంది కలిగించేలా ఉందని, భారత రెజ్లింగ్ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసిందని నోటీసులో తీవ్రంగా పేర్కొంది.
- అనర్హత వేటు: ఈ కారణాల వల్ల జూన్ 26 వరకు ఆమె ఎలాంటి దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించింది.
Vinesh Phogat Anti-Doping: పాత వివాదాల నేపథ్యంలో చర్యలు
గతంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి, పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన వినేష్‌కు ఈ నిర్ణయం ఊహించని దెబ్బగా మారింది. సమాఖ్య తీసుకున్న ఈ నిర్ణయంపై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు నిబంధనల అమలు అంటున్న సమాఖ్య, మరోవైపు ఆమెను టార్గెట్ చేస్తోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం వినేష్ ఫోగట్ ఈ నోటీసుపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోతే శిక్షా కాలం మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

