SERP Telangana: గ్రామీణ పేదరిక నిర్మూలనకు అసలైన అర్థం చెబుతూ, గ్రామీణ ప్రాంతా ల్లోని సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాబ 'సాటిగా మార్చే దిశగా సెర్చ్ (తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది.
ముఖ్యంగా మహిళా రైతుల ఆదా యం పెంచే లక్ష్యంగా రైతులను నేరుగా మార్కెట్కు అనుసంధానం చేస్తూ మధ్య దళారుల వ్యవస్థకు చెక్ పెడుతోంది. రైతులు పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెటింగ్ వ్యవస్థను సెర్ఫ్ ఏర్పాటుచేసింది. అంతేకాకుండా ఆన్లైన్ మార్కెటింగ్, ఆధునిక రిటైల్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో రైతులను అనుసంధానం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తోంది.
Read Also : Visa-on-Arrival: ఇక వీసా-ఆన్-అరైవల్ చాలా సులభం చేయనున్న యూఏఈ
With innovative measures, Serf… a global market for women farmers
SERP Telangana: ‘భేనిశాన్’ ద్వారా మామిడి ఎగుమతులు
సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భేనిశాన్’ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్రం లోని మామిడి రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన రైతు బాలకృష్ణ దంపతులు ఈ సీజన్లో మల్లిక రకం మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం చిన్న రైతులకు కొత్త ఆశలు నింపింది. దీంతో ఇప్పటి వరకు మామిడి రైతులకు రూ.151 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా రైతులకు ఆదనంగా 15 నుంచి 20 శాతం వరకు అధిక ఆదాయం లభిస్తోందన్నారు.
గతంలో కొద్దిపాటి ఉత్పత్తి ఉన్న రైతులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలకు ఎగుమతులు అసాధ్యంగా భావించేవారు. కానీ “బేనిశాన్” ద్వారా సమీకరణ, గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా, సప్లై చైన్ సదుపాయాలు కల్పించడం వల్ల చిన్న రైతులు కూడా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వేరుకునే అవకాశం లభిస్తోంది. రిలయన్స్, ఫ్లిప్కార్ట్, బిగ్బిస్కెట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మోర్, స్టార్ బజార్, రత్నదీప్ వంటి ఆధునిక రిటైల్ సంస్థలతోపాటు పలు అగ్రో ప్రాసెసింగ్ కంపెనీలతో భేనిశాన్ ఒప్పందాలు కుదుర్చుకుంది..
FPO ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర
గతంలో చిన్న సన్న కారు రైతులు తక్కువ పంట ఉత్పత్తి చేయడం వల్ల పెద్దవ్యాపారులు వారిని పట్టించు కునే పరిస్థితి ఉండేది కాదు. దీంతో దళారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్పివొల ద్వారా రైతుల ఉత్పత్తులను సమీకరించి పెద్ద మార్కెట్లకు విక్రయించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ప్రస్తుతం భేనిశాన్ సమాఖ్య పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 84 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు పని చేస్తున్నాయి. ఇవి 30 జిల్లాలు, 404 మండ లా లు, 3,072 గ్రామాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయి. మొత్తం 1.09 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులే కావడం విశేషం.

స్థిరమైన ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
ఈ అంశంపై సెర్చ్ ప్రధాన నిర్వహణ అధికారి రజిత నారెడ్ మాట్లాడుతూ… ఎగుమతులకు వెళ్లే ప్రతి వండును నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఎంపిక చేసి ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు. మామిడి పండ్ల నాణ్యత కాపాడేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో తెంపడం, గ్రేడింగ్ వంటి ప్రక్రియలపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన అంటే కేవలం పథకాల అమలు మాత్రమే కాదని, గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం వచ్చే వ్యవస్థను నిర్మించడమే అసలు లక్ష ్యమని, మంత్రి సీతక్క ఆలోచనలకు అనుగుణంగా సెర్చ్ ద్వారా రైతులకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతు వండించిన పంటకు మార్కెట్ కల్పించడం, మధ్యదళారుల ఆధిపత్యాన్ని తగ్గించడం, మహిళా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం దిశగా సెర్చ్ తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఐరోపా వ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరుకుంటున్న గనేరియా, సిఫిలిస్ కేసులు

