Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విపక్షాల హేళనలకు అభివృద్ధితోనే సమాధానం ఇచ్చాం.. కేంద్రమంత్రి

విపక్షాల హేళనలకు అభివృద్ధితోనే సమాధానం ఇచ్చాం.. కేంద్రమంత్రి

వార్త 3 weeks ago

Ram Mohan Naidu: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితమవ్వడం ఒక చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

భోగాపురం విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ఈ ప్రాంత అభివృద్ధికి ఒక బలమైన సింహద్వారంలా నిలుస్తుందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా ఈ ప్రాంతం వేగంగా విస్తరిస్తుందని చెప్పారు.

Read Also : Bhogapuram Airport : ఎర్రబస్సు రానిచోటుకు ఎయిర్పోర్టు వచ్చింది - నారా లోకేష్

 We have answered the opposition’s taunts through development: Union Minister

Ram Mohan Naidu:'ఎర్రబస్సుల నేలపై ఎయిర్‌బస్సులు'.. విమర్శకులకు ఘాటు కౌంటర్

ప్రతిపక్షాలు చేసిన హేళనలకు తమ ప్రభుత్వం అభివృద్ధి పనులతోనే సమాధానమిచ్చిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కేవలం ఎర్రబస్సులు మాత్రమే తిరిగే వెనుకబడిన ప్రాంతం అని కొందరు అవహేళన చేశారు. కానీ ఈ రోజు కళ్లు తెరిచి చూడండి.. ఎర్రబస్సులు తిరిగిన నేలపైనే అధునాతన ఎయిర్‌బస్సులు ల్యాండ్ అయ్యే స్థాయికి ఉత్తరాంధ్ర ఎదిగిందని నిరూపించాం అని విమర్శకులకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత వేగంగా ఉత్తరాంధ్రలో ప్రగతి పరుగులు పెడుతోందని ఆయన తెలిపారు. ప్రపంచం గర్వించే నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 'వికసిత్ భారత్', ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 'విజన్ 2047' లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని వివరించారు. ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రాంతీయ ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha