Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విపక్షాలపై మోదీ ఆగ్రహం: 'మహిళా ద్రోహులుగా నిలిచిపోతారు'

విపక్షాలపై మోదీ ఆగ్రహం: 'మహిళా ద్రోహులుగా నిలిచిపోతారు'

వార్త 2 months ago

పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. విపక్షాల వైఖరి దేశ మహిళా శక్తికి తీరని అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు.

శనివారం నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ బిల్లును అడ్డుకున్నందుకు విపక్షాలు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేశ మహిళల ఆశలను తుంగలో తొక్కిన విపక్ష నేతలు, తమ నిర్ణయం పట్ల జీవితాంతం చింతించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. విపక్షాల అసలు స్వరూపాన్ని దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

Read Also: Central Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

 Modi’s Anger

Modi’s Anger: ఘోర పాపం అన్న కిరణ్ రిజిజు

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సైతం విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. మహిళా వ్యతిరేకులు: బిల్లును అడ్డుకోవడం ఒక ఎత్తైతే, అది వీగిపోయినందుకు విపక్షాలు సంబరాలు చేసుకోవడం మరింత దురదృష్టకరమని, ఇది ఘోర పాపమని ఆయన అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లును ఏ ప్రాతిపదికన అప్రజాస్వామికమని అంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే బలమైన సంకల్పం ఉందని, అయితే డీలిమిటేషన్ మరియు ఇతర అంశాలను సాకుగా చూపి విపక్షాలు అడ్డంకులు సృష్టించాయని కేంద్రం ఆరోపించింది. మహిళలకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడం చారిత్రక తప్పిదమని పేర్కొంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వీగిపోయిన బిల్లు.. కేంద్రం నెక్స్ట్ ఏంచేయబోతుంది.. ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha