Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీరాభిమాని నిరంజన్‌కు 'OG 2' మ్యూజిక్ ఆల్బమ్ అంకితం!

వీరాభిమాని నిరంజన్‌కు 'OG 2' మ్యూజిక్ ఆల్బమ్ అంకితం!

వార్త 1 month ago

Pawan Kalyan Fan Niranjan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని, హనుమకొండకు చెందిన 17 ఏళ్ల చిన్నారి నిరంజన్ అకాల మరణం చిత్ర పరిశ్రమతో పాటు మెగా అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ నిరంజన్ కన్నుమూశాడు. రాజకీయాలు, డిప్యూటీ సీఎం బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, తన ప్రాణప్రదమైన అభిమాని మృతి పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, వేదనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరంజన్ జ్ఞాపకార్థం చిత్ర యూనిట్ ఒక అత్యున్నతమైన మరియు ఎమోషనల్ నిర్ణయాన్ని తీసుకుంది.

Read Also:Pawan Kalyan tribute to Niranjan: నిరంజన్ మరణం పట్ల పవన్ కళ్యాణ్ భావోద్వేగ నివాళి!

నిరంజన్‌కు పవన్ ఇచ్చిన మాట

గత నెలలోనే హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఆ చిన్నారితో కాసేపు సరదాగా గడిపారు. తిరుమల ప్రసాదాన్ని అందించి, ధైర్యం చెప్పారు. ఆ సమయంలో నిరంజన్ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్న పవన్.. త్వరలోనే ప్రారంభం కానున్న తన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'ఓజీ 2' (They Call Him OG 2) సినిమా వేడుకకు నిరంజన్‌ను ముఖ్య అతిథిగా (Chief Guest) ఆహ్వానిస్తానని స్వయంగా మాట ఇచ్చారు. అయితే, ఆ సినిమా షూటింగ్ పట్టాలెక్కే లోపే ఆ చిన్నారి అనంత లోకాలకు వెళ్లిపోవడం అందరినీ తీవ్రంగా కలచివేసింది.

Pawan Kalyan Fan Niranjan: థమన్ ఎమోషనల్ ట్రిబ్యూట్

సాధారణంగా భారీ చిత్రాల మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ఇండస్ట్రీలోని అగ్ర ప్రముఖులకు అంకితం ఇస్తుంటారు. కానీ, పవన్ కళ్యాణ్ ఆకాంక్షను గౌరవిస్తూ, ఒక సాధారణ అభిమానికి అత్యున్నత గౌరవం దక్కేలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ (Thaman) సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ ప్రకటన చేశారు.'ఓజీ 2' మ్యూజిక్ ఆల్బమ్ మొత్తాన్ని నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లు థమన్ అధికారికంగా ప్రకటించారు. మన లీడర్ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగమై, మా హృదయాలకు దగ్గరైన మా సైనికుడు నిరంజన్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అతని పట్ల గౌరవంతో ఈ ఆల్బమ్‌ను అంకితం ఇస్తున్నాం” అని థమన్ పేర్కొన్నారు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'ఓజీ 2' షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఆల్బమ్‌ను నిరంజన్‌కు అంకితం ఇవ్వడం పట్ల నెటిజన్లు, పవన్ ఆర్మీ థమన్‌ను అభినందిస్తూ నిరంజన్‌కు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

పవన్ కళ్యాణ్ వీరాభిమాని మృతి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన సోనూసూద్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha