Dailyhunt
విరాట్ కోహ్లీతో పోలికా? బాబర్ ఆజం సీరియస్

విరాట్ కోహ్లీతో పోలికా? బాబర్ ఆజం సీరియస్

వార్త 2 weeks ago

Babar Azam vs Virat: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 సీజన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం తనదైన శైలిలో అసహనాన్ని ప్రదర్శించారు. బుధవారం కరాచీ వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్‌పై విజయం సాధించిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తావన రావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Read Also: IPL : IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్

Babar Azam vs Virat: రిపోర్టర్ ప్రశ్న.. బాబర్ కౌంటర్

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక రిపోర్టర్ బాబర్ ఫినిషింగ్ సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ అడిగిన ప్రశ్న వివాదానికి దారితీసింది."విరాట్ కోహ్లీ తన జట్టును ఒంటిచేత్తో గెలిపించి, మ్యాచ్‌లను క్లోజ్ చేసినట్లుగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?" అని రిపోర్టర్ ప్రశ్నించగా..దీనికి బాబర్ ఆజం ఘాటుగా బదులిచ్చారు. "మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు అర్థమవుతోంది. ఆ చర్చను ఇక్కడితో ఆపేయండి" అంటూ రిపోర్టర్ నోరు మూయించారు. తాను కూడా కెరీర్‌లో ఎన్నో మ్యాచ్‌లను విజయవంతంగా ముగించానని, గణాంకాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుందని బాబర్ స్పష్టం చేశారు.

బాబర్ ఆజం ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బాబర్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తూ.. గెలిచిన మ్యాచ్‌లో ఇలాంటి ప్రతికూల ప్రశ్నలు అడగడం సరికాదని వాదిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ అభిమానులు, ఇతర క్రికెట్ విశ్లేషకులు మాత్రం.. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే బాబర్ తన ఫినిషింగ్ సామర్థ్యాన్ని, స్ట్రైక్ రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. బాబర్ తనపై వస్తున్న విమర్శలకు మైదానంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha