Dailyhunt
ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు

వార్త 2 weeks ago

గుజరాత్ టైటాన్స్ తరపున గిల్ అరుదైన ఘనత

Shubman gill ipl record : గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు.

బుధవారం (ఏప్రిల్ 8, 2026) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఈ ఘనతను అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్‌లో 2500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.

ఫోర్‌తో మైలురాయి చేరుకున్న గిల్

ఈ మ్యాచ్‌కు ముందు గిల్‌కు ఈ రికార్డు కోసం కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్ ఐదో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా గిల్ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరినప్పటి నుంచి గిల్ నిలకడగా రాణిస్తూ జట్టుకు కీలక బ్యాటర్‌గా నిలిచాడు.

Read Also:Nellore: మరణించిన పోలీసు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కుల అందజేత

 Shubman gill ipl record

210 పరుగులు చేసిన గుజరాత్

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ 70 పరుగులతో రాణించగా, జోస్ బట్లర్ 52 పరుగులతో మెరిశాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ వేగంగా 55 పరుగులు చేసి జట్టు స్కోరును 200 దాటించాడు. ఇప్పుడు 211 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

NH. 544డి పరిధిలో భూసమస్యలు పరిష్కరించాలి: జాయింట్ కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha