Chandrababu Naidu: విశాఖపట్నం రూపురేఖలను అంతర్జాతీయ ప్రమాణాలతో మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. వైజాగ్‌ను ప్రపంచ స్థాయి 'బే సిటీ' (Bay City) గా తీర్చిదిద్దేందుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం నుండి తూర్పుగోదావరి వరకు విస్తరించి ఉన్న 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER) సమీక్షా సమావేశంలో సీఎం కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
CM Chandrababu Naidu Vizag Review
Read also: Pedapenki development works: పెదపెంకి పనులపై కలెక్టర్ ప్రభాకర రెడ్డి సీరియస్!
కైలాసగిరి టు భోగాపురం.. సరికొత్త అభివృద్ధి జోన్!
ఈ ప్రాజెక్టులో భాగంగా కైలాసగిరి నుంచి భోగాపురం వరకు ఉన్న సాగర తీరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. 'వీఈఆర్' పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక 'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్' (PMU) ను ఏర్పాటు చేయాలన్నారు.
సమీక్షలోని ప్రధాన నిర్ణయాలు:
గ్రేహౌండ్స్ పరిధిలోని 303 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలి. కైలాసగిరి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాల కలయికగా మరింత సుందరంగా మార్చాలి. బీచ్ వాటర్ స్పోర్ట్స్, సరికొత్త వినోద ప్రాజెక్టుల కోసం భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలి. విశాఖ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ స్థాయిలో రీ-డిజైన్ చేయాలి. ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాల రక్షణ, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
Chandrababu Naidu: టూరిజం హబ్‌గా ఉత్తరాంధ్ర - గోదావరి జిల్లాలు
రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్టుతో పాటు పోలవరం, పాపికొండలు వంటి ప్రాంతాలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తే భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే పారిశ్రామిక ప్రాంతాలకు అనుబంధంగా నిర్మించే టౌన్‌షిప్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. నీతి ఆయోగ్ సిద్ధం చేసిన వీఈఆర్ ప్రాజెక్టు నివేదికపై విద్యార్థులు, మేధావులతో చర్చలు జరిపి, వారి విలువైన ఆలోచనలను, ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించాలని సీఎం కోరారు.
సమావేశానికి హాజరైన ప్రముఖులు
ఈ ఉన్నత స్థాయి సమీక్షలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కిమిడి అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరితో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, వైజాగ్ కలెక్టర్ హరీష్ అభిషిక్త్ కిషోర్ మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు!

