Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖపట్నం-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు :ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

విశాఖపట్నం-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు :ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

వార్త 2 months ago

Visakhapatnam to vijayawada bullet train: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విశాఖపట్నం - విజయవాడ మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ రైలు (హైస్పీడ్ రైల్) ప్రాజెక్టును ప్రవేశపెట్టనున్నట్లు ఏపీ బీజేపీ నాయకత్వం వెల్లడించింది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం. ఈ మెగా ప్రాజెక్టు గనుక పూర్తయితే, ఉత్తరాంధ్ర మరియు కోస్తా తీరప్రాంతాల మధ్య ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది.

 AP Bullet Train

Read also: YSR Statue Vandalism: నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం

గంటన్నరలోనే విశాఖ టు విజయవాడ: మారనున్న ప్రయాణ ముఖచిత్రం

ప్రస్తుతం విజయవాడ నుండి విశాఖపట్నం చేరుకోవడానికి సాధారణ రైళ్లలో కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. అయితే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. సుమారు 350 కిలోమీటర్ల మేర ఉండే ఈ దూరాన్ని బుల్లెట్ రైలు ద్వారా కేవలం 1.5 గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రారంభంలో ఈ రైళ్లను గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడపాలని, ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ హైస్పీడ్ కారిడార్ విజయవాడ నుంచి ప్రారంభమై.. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మీదుగా విశాఖపట్నం వరకు సాగనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైన ‘ఫైనల్ లొకేషన్ సర్వే’ (FLS) అనుమతుల కోసం అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపారు.

visakhapatnam to vijayawada bullet train: జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ షురూ!

మరోవైపు, ఏపీ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. దాదాపు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ కల సాకారమవుతుండటం గమనార్హం.

దీనితో పాటు, భవిష్యత్తులో విజయవాడ – కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను కూడా ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మంజూరైన ఏడు హైస్పీడ్ కారిడార్లలో మూడు ఏపీ మీదుగానే వెళ్తుండగా, ఇప్పుడు రానున్న కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి సరికొత్త బూస్టింగ్ ఇవ్వనున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

రేపే విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha