Vishwambhara Movie Update: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'.
ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా (Two Parts) విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు వశిష్ట స్పందిస్తూ.. ఆ రూమర్లకు పూర్తిస్థాయిలో తెరదించారు.
Read Also:Singer Suchitra: విజయ్ జీవితంలో 'పరాన్నజీవులు'.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్
Director Vassishta on Vishwambhara Two Parts
Vishwambhara Movie Update: వశిష్ట వ్యంగ్య సమాధానం
అయితే, ఈ వార్తలపై దర్శకుడు వశిష్ఠ స్పందిస్తూ 'అవునా.. నిజమా' అని నవ్వుతున్న ఎమోజీలను జత చేసి పోస్ట్ చేశారు. తద్వారా ఈ సినిమా కేవలం ఒకే భాగంగా రాబోతోందని ఆయన పరోక్షంగా స్పష్టం చేస్తూ రూమర్లను ఖండించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటి మౌనీరాయ్ ఒక ప్రత్యేక గీతంలో చిరంజీవితో కలిసి సందడి చేయనుంది. ఈ సినిమా కథ 14 లోకాల చుట్టూ తిరుగుతుందని, ఫాంటసీ అంశాలతో కూడిన అద్భుత దృశ్యకావ్యంగా నిలుస్తుందని సమాచారం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

