Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివాదంలో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్?

వివాదంలో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్?

వార్త 3 months ago

Tim David: రాయపూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలను ఆర్సీబీ సమాధి చేసింది.

అయితే, ఈ గెలుపు సంబరాల వేళ ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది.

Read Also:PBKS vs DC Live Score: పంజాబ్ కింగ్స్ పరుగుల విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

 Tim David Controversy vs Mumbai Indians

ఏమిటా వివాదం?

ఆర్సీబీ విజయం ఖరారైన వెంటనే డగౌట్ నుండి టిమ్ డేవిడ్ మధ్య వేలు (Middle Finger) చూపిస్తూ ఏదో సంజ్ఞ చేసినట్లుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.గెలిచిన ఆనందంలో, లేదా ప్రత్యర్థి జట్టును ఉద్దేశించి ఆయన ఇలా చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ వీడియోకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రామాణికత లేదు. ఆ సంజ్ఞ ఎవరిని ఉద్దేశించి చేసింది? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tim David: మ్యాచ్‌లో విఫలం.. గతంలో ముంబైకే ప్రాతినిధ్యం

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ బ్యాటర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. అతను గోల్డెన్ డకౌట్ (తొలి బంతికే అవుట్) అయ్యాడు.విశేషమేమిటంటే, ఈ ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ గత మూడు సీజన్‌ల పాటు ముంబై ఇండియన్స్‌కే ఆడాడు. 2025 వేలంలో ఆర్సీబీ గూటికి చేరాడు.గత సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 185 స్ట్రైక్ రేట్‌తో 187 పరుగులు చేసి ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

SRH 'జాతిరత్నాలు'.. మైదానంలోనే కాదు బయట కూడా రచ్చ చేస్తున్న ఇషాన్, నితీశ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha