Anushka Sharma Controversy : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.
ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ హోమియోపతి ఫిజీషియన్ రాజన్ శంకరన్ మాట్లాడిన ఒక వీడియోను షేర్ చేయడమే ఈ వివాదానికి కారణమైంది. ఆ వీడియోతో పాటు, తన వ్యక్తిగత జీవితంలో హోమియోపతి వైద్యం చాలా కీలక పాత్ర పోషించిందని, తనకు దానివల్ల ఎంతో మేలు జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి అనుష్క శర్మ హోమియోపతిని ప్రమోట్ చేయడంపై నెటిజన్లు, వైద్య నిపుణులు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్ర స్థాయిలో చర్చలు, వాదనలు జరుపుతున్నారు.
Read Also : పండు మాస్టర్ కాళ్లకు ఆపరేషన్ తప్పనిసరి అంటున్న వైద్యులు!

శాస్త్రీయతపై ప్రశ్నలు వర్సెస్ మద్దతుదారుల వాదనలు
అనుష్క పోస్ట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొందరు, హోమియోపతి అనేది పూర్తిగా అశాస్త్రీయమైనదని, దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు (Scientific Evidence) లేవని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి నకిలీ వైద్య పద్ధతులను, దొంగ బాబాలను పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు మండిపడుతున్నారు. అయితే, మరోవైపు అనుష్కకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు మాత్రం… అల్లోపతి మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు) హోమియోపతిలో ఉండవని, దీర్ఘకాలిక వ్యాధులకు ఇది ఎంతో మేలైన చికిత్స అని వాదిస్తున్నారు. అల్లోపతి కంటే హోమియోపతే బెటర్ అని, అనుష్క శర్మ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె మద్దతుదారులు సమర్థిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

