Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివాదంలో చిక్కుకున్న ఇరాన్ అధ్యక్షుడు !

వివాదంలో చిక్కుకున్న ఇరాన్ అధ్యక్షుడు !

వార్త 2 weeks ago

Brics Summit 2026 : బిఆర్సిఎస్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారతదేశానికి విచ్చేసిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక ఊహించని వివాదంలో చిక్కుకున్న వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్ రిసెప్షన్ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ధార్మిక పీఠాధిపతి జగద్గురు స్వామి సతీశాచార్య మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు, పీఠాధిపతి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు ఉన్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక ఇస్లామిక్ దేశ అధినేత హిందూ ధర్మగురువు పాదాలకు నమస్కరించారనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపింది.

వివాదంపై ఇరాన్ ఎంబసీ మరియు నిజనిర్ధారణ స్పష్టత

ఈ వివాదంపై ఇరాన్ రాయబార కార్యాలయం (ఎంబసీ) వర్గాలు మరియు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తీవ్రంగా స్పందిస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశాయి. ఆ కార్యక్రమంలో ఒక నాయకుడు అందించిన ముఖ్యమైన పత్రం (లేఖ) కిందపడటంతో, దానిని కిందకు వంగి తీసే క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశాన్ని తప్పుగా చిత్రీకరించారని ఎంబసీ స్పష్టం చేసింది. పెజెష్కియాన్ ఎవరి కాళ్లకూ నమస్కరించలేదని, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. వీడియో దృశ్యాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ రకమైన అసత్య ప్రచారం ప్రచారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు.

BRICS సమ్మిట్ రెండో రోజు.. షెడ్యూల్ ఇదే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha