Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వృద్ధులకు తెలంగాణ సర్కారు ఫ్రీ బస్సు?

వృద్ధులకు తెలంగాణ సర్కారు ఫ్రీ బస్సు?

వార్త 2 weeks ago

Senior citizens free bus:తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం మంచి ఆదరణ పొందింది.

ఇదే స్పూర్తితో వృద్ధుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల మీద ఆధారపడే వృద్ధుల విజ్ఞప్తులను అధికారులు పరిశీలిస్తున్నారు.

Read also: Telugu states chicken prices: ఆదివారం చికెన్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

 Free bus travel for the elderly from the government?

పొరుగు రాష్ట్రాల్లో రూల్స్ ఎట్లున్నయ్

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారికి 25 శాతం రాయితీ ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఉచితంగా ప్రయాణం కల్పించే అంశంపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి రవాణా శాఖ అధికారులు సాధ్యాసాధ్యాలను నిశితంగా అంచనా వేస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన విధివిధానాలు వెలువడే అవకాశం ఉంది.

Senior citizens free bus:అవ్వ తాతలకు పెద్ద పీట వేస్తున్న పాలకుల తీరు

ప్రభుత్వం తీసుకునే ఈ సాహసోపేత నిర్ణయం వల్ల లక్షలాది మంది వృద్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ సొంత పనుల మీద ప్రయాణాలు చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం అమలులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు పండుగ చేసుకునేలా శుభవార్త అందనుంది.

Epaper: epaper.vaartha.com

ములుగు రామప్పకు మరో అరుదైన గౌరవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha