Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్మెంట్: పోలీస్ ప్రస్థానానికి ఘనమైన వీడ్కోలు

డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్మెంట్: పోలీస్ ప్రస్థానానికి ఘనమైన వీడ్కోలు

వార్త 1 month ago

DGP B Shivadhar Reddy Retirement: తెలంగాణ పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విశిష్ట సేవలు అందించిన డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి.

Read Also:NITI Aayog releases new roadmap: జీడీపీ నుండి ఉత్పాదకత వైపు దృష్టి.. సుమన్ బెరీ

గౌరవ వందనం – వీడ్కోలు వేడుక

సుమారు 32 ఏళ్ల పాటు పోలీస్ శాఖలో బి. శివధర్ రెడ్డి నిష్కళంకమైన సేవలు అందించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీలోని పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు బలగాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి.

 CV Anand New DGP Telangana

DGP B Shivadhar Reddy Retirement: పరిణామ క్రమంపై శివధర్ రెడ్డి వ్యాఖ్యలు

తన సుదీర్ఘ ప్రయాణంలో పోలీసింగ్ విధానాల్లో వచ్చిన మార్పులను ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో పోలీసులపై ఉన్న అపవాదులను తుడిచివేసి, సామాన్య ప్రజలకు పోలీసులను దగ్గర చేయడంలో ఎంతో సాధించామని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలతో ఏర్పడిన దూరాన్ని తగ్గించి, విశ్వసనీయతను పెంచామని చెప్పారు.

1970-80ల నాటి కఠినమైన పోలీసింగ్ పద్ధతుల నుంచి నేడు ఆధునిక, సిటిజన్ ఫ్రెండ్లీ విధానాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు.తన స్వరాష్ట్రానికి డీజీపీగా సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖను తీర్చిదిద్దిన తృప్తితో తాను విధులకు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న సి.వి. ఆనంద్ ను ఒక సమర్థవంతమైన అధికారిగా ఆయన అభివర్ణించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శివంపేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం - SSC ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha