Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభం

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభం

వార్త 1 week ago

విసి ఆచార్య అల్దాస్ జానయ్య

Digital Agriculture: వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతలు, ప్రిసిషన్ ఫార్మింగ్, నవకల్పనలు, స్థిరమైన వ్యవసాయ విధానాల్లో భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ప్రారంభమైంది.

ఈ వేదిక ద్వారా రెండు దేశాల విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమలు, ఇతర భాగ స్వామ్య సంస్థల మధ్య సంయుక్త పరిశోధనలు, పైలట్ ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెంగళూరు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ సిఓఈఎఫ్పీఓ బెంగళూరు సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇండియా- ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించాయి.

Read Also: Gas : గ్యాస్ సిలిండర్ల ఆటోలకు ఎస్కార్ట్..ఇదేందయ్యా… ఇది నేను ఎక్కడ చూడలే !!

Digital Agriculture: రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొ నేందుకు కీలకం

ఈ సదస్సులో భారత్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల భాగస్వాములు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారత్లో ఆస్ట్రే లియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మాట్లాడుతూ… రైతులు వాతావరణ మార్పుల ప్రభా వాన్ని ఎదుర్కొ నేందుకు భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యా లయ విసి అల్దాస్ జానయ్య మాట్లాడుతూ.. విద్యా సంస్థలు, పరిశ్రమలు, సాంకేతిక నిపుణులు, రైతుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో ఈ కార్య క్రమం దోహదపడుతుందని తెలిపారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయ ప్రతినిధి డాక్టర్ విశాల్ మాట్లాడుతూ… వ్యవ సాయ రంగంలో వాస్తవ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ శాస్త్రీయ భాగస్వా మ్యాలు ఎంతో అవసరమన్నారు.

సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి

అవసరమని చార్లెస్ స్టర్ట్ యూనివర్సిటీ ప్రో వైస్ చాన్స్ లర్ మైకేల్ ఫ్రెండ్ మాట్లాడుతూ… పరిశోధన, ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, వాతావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ప్రపంచస్థాయి భాగస్వామ్యాలు పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ద్వారా స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలు, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, సంయుక్త ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి.. మహేశ్వర్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha