Medak: వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. గురువారం కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వరము సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.





Read also: Hyderabad Metro: భూమి లోపల, ఆకాశంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త ప్రయాణం!

Medak: మేలైన విత్తనాలు యంత్రాలతో పెరగనున్న దిగుబడి

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశమని , రైతులు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని పిలునిచ్చారు.

నూతన వంగడాలు, పనిముట్లు,యంత్రాలను ఉపయోగించి పంటల ఉత్పత్తి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, కొల్చారం తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఆయా గ్రామాల్లో సర్పంచ్ లు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

