Funds : శక్తికి మించిన సహాయం కానీ, సహకారం కానీ చివరకు కార్యక్రమాలు చేయడం అంత శ్రేయోస్కరం కాదు. మోయలేని భారం తలకెత్తుకుంటే అసలుకే మోసం వస్తుందన్న విషయాన్ని విస్మరించకూడదు.
చరిత్రలో ఎన్నో సందర్భాల్లో ఎందరో పెద్దల విషయం లో ఇది రుజువైంది. ఏదో ఒకటి, రెండు సందర్భాల్లో అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ అదేపనిగా, ధ్యేయంగా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా అందిన కాడికి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా వెచ్చిస్తుంటే ఇది వ్యక్తికి కానీ, సంస్థకు కానీ, ప్రభుత్వానికి కానీ ఏదో ఒక నాటికి చేతులు ఎత్తక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. ఎన్నో సంస్థలు, కుటుంబాలు, వ్యక్తులు ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొంది ఆ బాటలో నడిచి పతనావస్థకు చేరుకున్న ఉదాహరణలు కోకొ ల్లలు. దివాలాకు సంకేతం. ఆస్తులు కుదువ పెట్టుకోవడం, అమ్ముకోవడం అవి కూడా ఆవిరైపోయిన తర్వాత చివరి అంకమే దివాలా. దివాలా అనేది వ్యక్తి విషయం లో తీవ్రంగా పరిణమిస్తారు. ఒకరకంగా సమాజ బహిష్కరణకు గురైనట్లు దివాలా తీసిన వ్యక్తిని కానీ, కుటుంబాన్ని కానీ సమాజం ఎలా చేస్తుందో వేరే చెప్పక్కర్లేదు. గత రెండు, మూడు దశాబ్దాలుగా దేశంలో అనేక రాష్ట్రా లు ఇష్టానుసారంగా అప్పుల మీద అప్పులు తెచ్చి కార్య క్రమాలకు హద్దుపద్దు లేకుండా వెచ్చిస్తున్నారు.
Read Also : Shock : సామాన్య ప్రజలపై ధరల పిడుగులు
funds
funds : అప్పు ల ఊబి
ఓట్లకోసం, అధికారం కోసం, సీట్ల కోసం ప్రజలు అడిగినవే కాదు అడగనివి, ఊహించని వరాలు కూడా గుప్పిస్తున్నారు. వాటిని తీర్చేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దీంతో మిగులు, నిధులతో ఉన్న రాష్ట్రాలు అప్పు ల ఊబిలో కూరుకుపోతున్నాయి. వడ్డీయే యేటవేలాది కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. మరొకపక్క పన్నుల మీద పన్నులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి పిట్టను కొట్టా పొయ్యిలో పెట్ట అన్నట్లుగా ఉంది. నెలనెలా ఉద్యోగస్తుల జీతభత్యాలకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొంది. మరొకపక్క ప్రజలను ఆరోగ్య పరంగా, ఆర్థికంగా తీవ్రంగా కృంగదీస్తున్న మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. మరొకపక్క దళారులు చేసే మోసాలు అన్నీఇన్నీ కావు. కృత్రిమ కొరత సృష్టించి ధరలను సామాన్యులు అందుకో లేనంతగా పెంచేసు కుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకున్నట్లు కన్పించడం లేదు.
అంతులేని అవినీతి
మనది సంక్షేమ ప్రభుత్వమే, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిందే. దారిద్ర్యరేఖకు దిగువ ఉన్న లక్షలాది మంది నిరుపేదలకు, బడుగు, బలహీన వర్గా లకు చేయూత నివ్వాల్సిందే. వారికి అన్నిరకాల సహకా రాలు అందించాల్సిందే. అందులో మరో అభిప్రాయానికి తావులేదు. ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ దీన్ని వ్యతిరేకించరు, వ్యతిరేకించలేరు కూడా. కానీ వారి పేరు పై జరుగుతున్న దోపిడీ మాట ఏమిటి? అంతులేని అవినీతి సంగతి ఏమిటి? వేలాది కోట్ల రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటున్న డబ్బులు ఇలా దుర్వినియోగం కావడం ఎంతవరకు న్యాయమో పాలకులు ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గ్రామీణా భివృద్ధి శాఖ ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిరుపేదల అభ్యున్నతికి. వెచ్చించారు. ఏపద్దు కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించారో అధికారులకే లెక్కలు దొరకని పరిస్థితి. దారిద్య్రరేఖకు దిగువనున్న కోట్లాది కుటుంబాలను ఆదుకుని వారిని ఆ దుర్భర పరిస్థితుల నుంచి దాటించామని అంకెలతోసహా వివరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించినా దారిద్య్రరేఖకు దిగువ నున్న వారి సంఖ్య పది, ఇరవైశాతానికి మించరనివారు స్పష్టం చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెల్లకార్డుల సంఖ్య చూస్తే దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య ఎనభైశాతానికిపైగా ఉంది. రెండూ ప్రభుత్వ విభాగాలే. ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు. ఇందులో ఏది సత్యం? ఏది అసత్యమన్నది పాలకులకు తెలియంది కాదు. ఒకటి, రెండు కాదు, యేటా వేలాది కోట్ల దళా రుల కైవసం అయిపోతున్నది.
funds
లక్షల బోగస్ కార్డులు
బినామీ, బోగస్, కార్డు లను ఏరివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అంతగా సఫలీకృతం కావడం లేదు. దేశవ్యాప్తంగా చూసినా ఎన్ని లక్షల బోగస్ కార్డులు ఉన్నాయో లెక్కలకు అందదు. ఈ కార్డులపై పేదలకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు, బియ్యం ఒకటేమిటి ఇండ్లతోసహా భోంచేశారు. ఇదంతా అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. అనర్హులను పూర్తిగా ఏరి వేయలేని నిస్సహాయ, నిర్భాగ్య పరిస్థితి. దళారుల ఆట కట్టించలేని దౌర్భగ్య పరిస్థితి. మరొకపక్క అవినీతి విజృం భించిపోతున్నది. ఇంకొక పక్క రైతులకు గిట్టుబాటు కాన రావడం లేదు. అందుకే ఆత్మహత్యల పరంపర కొన సాగుతున్నది. ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కొందరు దళా రులకు, మరికొందరు వ్యాపారులకు కల్పతరువుగా మారుతున్నాయి. లాభాల కోసమే వ్యాపారాలు చేస్తున్నారనేది వాస్తవం. కమిషన్ల కోసమే దళారులు ఉన్నారనేది కూడా నిజం. అలా వ్యవహరిస్తే అందుకు పెద్దగా తప్పు పట్టలేం. కానీ నెలనెలా ప్రజాసొమ్మును జీతభత్యాల రూపంలో తీసుకుంటున్న కొందరు అధికారులను విమర్శించే కంటే వీరిని ప్రోత్స హిస్తున్న రాజకీయ నాయకులను నిందిం చాలి. ఏదిఏమైనా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, నిర్మాణాత్మక కార్యక్రమాల నిధులు పక్కదారి పట్టకుండా దళారుల పాలు కాకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ నడుం కట్టాల్సిన తరుణమిది. ప్రజాపాలకులు అనేవారు ప్రతిపైసా ప్రజాసొమ్ముకు కాపలాదారులమనే విషయం విస్మరించరాదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

