Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

Winter Olympics: ఒలింపిక్స్‌ లో కండోమ్స్ కొరత

వార్త 4 months ago

శీతాకాల ఒలింపిక్స్-2026లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటలీలో జరుగుతున్న ఈ క్రీడా మహోత్సవంలో పాల్గొంటున్న సుమారు 2900 మంది అథ్లెట్స్ కోసం ముందస్తుగా సిద్ధం చేసిన 10వేల కండోమ్ ప్యాకెట్లు కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ కావడం నిర్వాహకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒలింపిక్స్‌లో ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు, అయితే కరోనా సమయంలో వీటికి బ్రేక్ పడింది.

T20 World Cup: గాయలతో వైదొలుగుతున్న ఆటగాళ్లు

'కండోమ్ క్రైసిస్'

ఒలింపిక్స్ ప్రారంభమయ్యాక నిర్వాహకులు సుమారు 10 వేల కండోమ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అయితే, 92 దేశాల నుంచి వచ్చిన దాదాపు 2,900 మంది అథ్లెట్లు ఉన్న క్రీడా గ్రామంలో ఈ నిల్వలు చాలా వేగంగా ఖాళీ అయ్యాయి. సరఫరా కేవలం మూడు రోజుల్లోనే అయిపోయిందని, కొత్త స్టాక్ ఎప్పుడొస్తుందో తెలియదని ఓ అథ్లెట్ చెప్పినట్లు ఇటాలియన్ మీడియా 'లా స్టాంపా' తన కథనంలో పేర్కొంది.సాధారణంగా ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు ఉచితంగా కండోమ్‌లు అందించడం 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి వస్తున్న సంప్రదాయం. సురక్షిత శృంగారాన్ని ప్రోత్సహించడం, HIV/AIDS వంటి వ్యాధుల నివారణ దీని ముఖ్య ఉద్దేశం.

గత 2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్‌లో 10,500 మంది అథ్లెట్ల కోసం 3 లక్షలకు పైగా కండోమ్‌లను అందించారు. అయితే, వింటర్ ఒలింపిక్స్‌లో అథ్లెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈసారి తక్కువ స్టాక్ తెచ్చారు.అయితే, అథ్లెట్ల నుంచి ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో ఈ 'కండోమ్ క్రైసిస్' ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్వాహకులు వెంటనే రంగంలోకి దిగారు. త్వరలోనే కొత్త స్టాక్‌ను క్రీడా గ్రామానికి తరలించి, ఒలింపిక్స్ ముగిసే వరకు కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha