Dailyhunt
WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

WPL 2026: మరికాసేపట్లో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం

వార్త 3 months ago

హిళా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. నేటి నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ (WPL 2026) ఘనంగా ప్రారంభం కానుంది.

నేడు అంటే జనవరి 9, శుక్రవారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. రాత్రి 7:30 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

దీనికంటే సరిగ్గా ఒక గంట ముందు, అంటే సాయంత్రం 6:30 గంటలకు మెరిసే కాంతుల మధ్య ఓపెనింగ్ సెరిమనీ మొదలవుతుంది.ఈ సారి ఓపెనింగ్ సెరిమనీని బీసీసీఐ చాలా స్పెషల్ గా ప్లాన్ చేసింది. ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ తన పాపులర్ పాటలతో స్టేడియంలో జోష్ నింపనున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అలరించనుంది. విశేషమేమిటంటే, మాజీ మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కూడా ఈ వేడుకలో మెరవనున్నారు. దీంతో క్రికెట్ గ్రౌండ్ అంతా సెలబ్రిటీల వెలుగులతో నిండిపోనుంది.

ఎక్కడచూడొచ్చంటే?

అద్భుతమైన వేడుకను, మ్యాచ్‌లను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‎లో వీక్షించవచ్చు. ఒకవేళ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.ఈ సీజన్‌లో మొత్తం ఐదు జట్లు - ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడనున్నాయి. మొత్తం 22 మ్యాచ్‌లు జరగనుండగా, లీగ్ మ్యాచ్‌లు నవీ ముంబైలో జరుగుతాయి. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు వడోదరలోని కోటాంబి స్టేడియంలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ గ్రాండ్ టోర్నీకి ముగింపు పలకనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Malaysia Badminton Tournament: సెమీస్‌కు పీవీ సింధు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha