Dailyhunt
ఏపీలో రూ.21,500 కోట్లతో జిఇసి అభివృద్ధి

ఏపీలో రూ.21,500 కోట్లతో జిఇసి అభివృద్ధి

వార్త 1 week ago

4 దశల్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్

AP Green Energy Corridor: రాష్ట్రంలో 4 దశల్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ 8-10 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రూ.21,500 కోట్లతో జీఈసీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించింది. జీఈసీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం లభించింది. ప్రాజెక్టుకయ్యే ఖర్చులో రూ.6,450 కోట్లు కేంద్రం గ్రాంటు రాష్ట్ర విద్యుత్ ఎగుమతి విధానం పరిధిలో, సౌర, పవన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం సుమారు 80,798 మెగావాట్ల సామర్థం గల ప్రాజెక్టు లకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదాలు మంజూరు చేసింది.

వీటిలో, మొత్తం సుమారు 9,386 మెగావాట్ల ఉత్పత్తి సామర్థం కలిగిన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 11,725 మెగావాట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో అత్యధిక భాగం రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తీరప్రాంత ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించడానికి ఒక పటిష్టమైన విద్యుత్ ప్రసార నెట్వర్క్ అత్యవసరం.

Read Also : Anantapur Honeytrap Case: హనీ ట్రాప్ కేసులో పోలీసులపై వేటు.. నలుగురు డిస్మిస్

 Green Energy Corridor Development in Andhra Pradesh

AP Green Energy Corridor: రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు అనుసంధానం

రాయలసీమ నుంచి ఉత్తర ఆంధ్రకు అనుసంధానిస్తూ 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యుత్ను జాతీయ గ్రిడ్లోకి అనుసంధానిం చడానికి వీలుగా కూడా విద్యుత్ ప్రసార నెట్వర్క్ ను విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా ఎన్ని ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందో గుర్తించిన తర్వాత, దానికి అనుగుణంగా ట్రాన్స్కో ఒక నెట్వర్క్ విస్తరణ ప్రణాళికను రూపొందించింది.

రాబోయే 2 దశాబ్దాల పాటు నిరంతరాయ విద్యుత్ సరఫరా నెట్వర్స్ను నిర్ధారించేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ సామర్థం ఉత్పత్తి అయిన విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేయడానికి సరిపోవడం లేదు. విశాఖపట్నంలో డేటా సెంటర్లు, భారీ పరిశ్రమ లు ఏర్పాటు కానున్నాయి. తత్ఫలితంగా, వారి విద్యుత్ సరఫరా అవసరాలను తీర్చడానికి విద్యుత్ నెట్వర్ను విస్తరించడం అత్యవ సరంగా ప్రభుత్వం గుర్తించింది.

ట్రాన్స్కో ప్రణాళిక – కేంద్రం సహాయం

రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఐసీ)ను 4 దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో నిర్ణయించింది. ఈ మొత్తం ప్రాజెక్టును 8 నుంచి 10 ఏళ్లలో పూర్తి చేసేలా ఒక ప్రణాళికను రూపొందించింది. ఇందులో ఒక్కో దశ. కాలపరిమితి రెండేళ్లుగా ఉంటుంది. సుమారు. రూ.21,500 కోట్ల అంచనా వ్యయంతో జీఈసీని అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. సుమారు 11,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 7,300 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సరఫరా చేయడానికి, ప్రస్తుతం ఉన్న విద్యుత్ ప్రసార నెట్వర్క్ ను విస్తరించాల్సిన అవసరం ఉందని ట్రాన్స్కో అంచనా వేసింది.

ఈ ప్రాజెక్టుకు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలిపింది. ఆర్ధిక ప్రణాళిక రూపకల్పనలో సహకరించేందుకు గాను, జీఈసీ ప్రాజెక్టును ఎన్ని దశల్లో పూర్తి చేయనున్నారనే దానిపై వివరణాత్మక సమాచారాన్ని సమర్పించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఇటీవల ట్రాన్స్కోను కోరింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సుమారు రూ.6,450 కోట్లను (30శాతం) కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో అందించనుంది.

ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు

రాష్ట్ర విద్యుత్ ఎగుమతి విధానం పరిధిలో, సౌర, పవన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం సుమారు 80,798 మెగావాట్ల సామర్థం గల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆమోదాలు మంజూరు చేసింది. వీటిలో, మొత్తం సుమారు 9,386 మెగావాట్ల ఉత్పత్తి సామర్థం కలిగిన ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 11,725 మెగావాట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయి. ఈ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో అత్యధిక భాగం రాయలసీమ ప్రాంతంలోనే ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తీరప్రాంత ఉత్తరాంధ్ర జిల్లాలకు తరలించడానికి ఒక పటిష్టమైనవి విద్యుత్ ప్రసార నెట్వర్క్ అత్యవసరం. రాయలసీమ నుంచి ఉత్తర ఆంధ్రకు అనుసంధా నిస్తూ 1,200 సర్క్యూట్ కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ విద్యుత్ను జాతీయ గ్రిడ్లోకి అనుసంధానించు డానికి వీలుగా కూడా విద్యుత్ ప్రసార నెట్వర్క్ ను విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాయలసీమలో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు కలిపి మొత్తం 5,000 మెగావాట్లు సామర్థంతో కొనసాగుతున్నాయి. ఈ విద్యుత్ 17 సబ్ స్టేషన్ల ద్వారా కేంద్ర గ్రిడ్కు ప్రసారం చేస్తూ తదనంతరం ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. జీఈసీ ప్రాజెక్టులో భాగంగా ఒక్కోటి 400 కేవీ సామర్థం కలిగిన 4 కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సబ్ స్టేషన్లలో 2 అనంతపురం జిల్లాలోనూ ఒక్కోటి చొప్పును కడప పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా ఎన్ని ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందో గుర్తించిన తర్వాత, దానికి అనుగుణంగా ట్రాన్స్కో ఒక నెట్వర్క్ విస్తరణ ప్రణాళికను రూపొందించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెళ్లి భోజనం తిన్నారు.. 20 మందికి అస్వస్థత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha