Yadagirigutta: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలోని పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.
Read Also :Indrakeeladri VIP Darshan: ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు నిలిపివేత
పూజలకు టికెట్ ధరలు
శరన్నవరాత్రి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తుల కోసం ఆలయ అధికారులు టికెట్ ధరలను ప్రకటించారు. నవరాత్రి పూజలకు రూ.1,116 టికెట్ ధర నిర్ణయించారు. ఈ టికెట్ ద్వారా దంపతులకు పూజల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తశతి పారాయణం, లక్ష కుంకుమార్చనకు రూ.116 టికెట్ ధరగా నిర్ణయించారు.

Yadagirigutta: రుద్ర హోమం తాత్కాలికంగా రద్దు
ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రుద్ర హోమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో చేసిన ఈ మార్పులను భక్తులు గమనించి సహకరించాలని ఆలయ ఈవో భవానీ శంకర్ కోరారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

