Apple New CEO : యాపిల్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ వార్షిక వేతనం ఐటి ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. కంపెనీ ప్రతిపాదనల ప్రకారం ఆయన ఏడాదికి సుమారు 58 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.
551 కోట్లు) అందుకుంటారు. ఈ ప్యాకేజీలో ప్రాథమిక వేతనంతో పాటు స్టాక్ ఆప్షన్లు, పనితీరు ఆధారిత ప్రోత్సహకాలు భాగమై ఉన్నాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) దాఖలు చేసిన నివేదికలో యాపిల్ సంస్థ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది.

యాపిల్ నాయకత్వ మార్పు – కొత్త సమీకరణాలు
దిగ్గజ సంస్థను సుదీర్ఘకాలం విజయవంతంగా నడిపించిన మాజీ CEO టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ బాధ్యతలు స్వీకరించగా, టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొత్త పాత్రను చేపట్టారు. కొత్త హోదాలో టిమ్ కుక్ వార్షిక వేతనం 47 మిలియన్ డాలర్లుగా (రూ. 446 కోట్లు) ఖరారైంది. సాంకేతిక రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తూ, కంపెనీ భవిష్యత్తు ఉత్పత్తుల అభివృద్ధికి జాన్ టెర్నస్ నాయకత్వం వహించనున్నారు.

