Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యాపిల్‌కు కొత్త సీఈఓ. టిమ్ కుక్ తప్పుకుంటారా?

యాపిల్‌కు కొత్త సీఈఓ. టిమ్ కుక్ తప్పుకుంటారా?

వార్త 2 months ago

యాపిల్‌లో కీలక మార్పు

Apple new CEO : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం యాపిల్ కీలక నాయకత్వ మార్పును ప్రకటించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

ఆయన స్థానంలో ప్రస్తుత హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టనున్నారు.

సెప్టెంబర్ నుంచి కొత్త బాధ్యతలు

సెప్టెంబర్ 1 నుంచి 50 ఏళ్ల జాన్ టెర్నస్ యాపిల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే టిమ్ కుక్ పూర్తిగా సంస్థను వీడకుండా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన నాయకుడిగా కుక్ గుర్తింపు పొందారు.

Read also: Strait of Hormuz: యూరోపియన్ యూనియన్ తీరుపై ఇరాన్ ఆగ్రహం

 Apple new CEO

యాపిల్‌కు కొత్త సవాళ్లు

జాన్ టెర్నస్ బాధ్యతలు చేపడుతున్న ఈ సమయం యాపిల్‌కు కీలక దశగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో ఎన్విడియా వంటి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. అలాగే అగ్మెంటెడ్ రియాలిటీ, స్మార్ట్ డివైజ్‌ల వంటి నూతన టెక్నాలజీ రంగాల్లో కూడా పోటీ పెరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అమెరికాతో చర్చలకు ఇరాన్ నో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha