Dailyhunt
యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ

యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ

వార్త 1 week ago

రాష్ట్ర వ్యాప్తంగా 8251 కేంద్రాలు ఏర్పాటు

Yasangi Paddy Procurement: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్ కు సంబంధించి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

కొనుగోళ్లు సజావుగా జరిగేలా రాష్ట్రవ్యాప్తంగా 8,251 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధాన్యం అమ్మిన తర్వాత రెండు రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. సన్నరకం వడ్లకు ఇచ్చే బోనస్ను కూడా వెంటనే జమ చేయనున్నారు. సన్నరకం బియ్యంపై క్వింటాకు రూ.500 రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ బోనస్ కూడా వెంటనే పంపిణీ చేయనున్నారు.

Read Also : Choutakur Ayurveda Medical Camp: ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మందుల పంపిణీ

 Grain procurement begins in Telangana

Yasangi Paddy Procurement: 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం

రబీ సీజన్లో మొత్తం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరిం చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలో మొత్తం 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపు 152.03 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరికోతలు ముమ్మరం కావడంతో ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. 2024-25 రబీ సీజన్లో 137.10 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం 70.13 లక్షల టన్నులు సేకరించాలని భావించగా అంతకంటే ఎక్కువగా ఏకంగా 73.70 లక్షలు వచ్చింది. ఈ సారి 90 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొనుగోళ్లలో మహిళా సంఘాల కీలక పాత్ర

ధాన్యం కొనుగోళ్లలో మహిళా స్వయంసహాయక సంఘాలుకీలకంగా పనిచేస్తున్నాయి. ఇందిరా క్రాంతి పథం (ఐకెపి) ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాల సంఖ్య సీజన్ సీజన్కూ వేగంగా పెరుగుతోంది. గ్రామీణఆర్థిక వ్యవస్థలో కొత్తమార్పునకు దారితీస్తున్నాయి. ఈరబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మహిళా సంఘాలు, వ్యవసాయ సహకారం సంఘాల ద్వారా మొత్తం 8,251 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందులో 3,403 కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లు నిర్వహించేలా అవకాశం కల్పించింది. దీంతో మొత్తం కొనుగోలు కేంద్రాల్లో 40 శాతం కంటే ఎక్కువ కేంద్రాలు మహిళా సంఘాలకే అవకాశం ఇచ్చినట్లయింది.

మహిళా సాధికారత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం యాసంగి వరి కోతలు మొదలు కావడంతో రాష్ట్రంలో దాదాపు 500 ఐకెపి కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నెలాఖరు నాటికి అన్ని 3,403 కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు కేవలం కొనుగోలు వ్యవస్థకే పరిమితం కాకుండా వారి ఆర్థిక స్థిరత్వానికి ప్రధాన ఆధారంగా మారాయి. గత ఖరీఫ్ సీజన్లో మహిళా సంఘాలు వంట కొనుగోల్ల ద్వారా రూ. 80.60 కోట్ల కమిషన్ ఆర్జించగా గత యాసంగి సీజన్లో రూ. 81.65 కోట్ల ఆదాయం నమోదు కావడం వారి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ఎసిబి దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha