రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్ పెక్టర్
ACB raids in Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాం తహశీల్దార్ కార్యాలయం అవినీతి కేంద్రంగా మారుతున్నట్లు మరో ఘటన రుజువైంది.
భూమి ఎంక్వయిరీ పనిలో సహాయం చేస్తానంటూ రైతు వెంకటస్వామి నుంచి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందుగానే ప్రణాళిక రచించి వల పన్నారు.
Read Also : Karimnagar: కరీంనగర్ పోలీస్ శాఖలో భారీ కుంభకోణం.. మరణించిన వారికి జీతాలు!
anthargam tahsildar office acb raid revenue inspector caught
ACB raids in Peddapalli: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో అధికారిని రెడ్యండెడ్ అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలంలోనే విచారణ చేపట్టి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఈ దాడిని ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ నేతృ త్వంలో నిర్వహించారు. లంచాల కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఇదే కార్యాలయంలో గతంలో కూడా ఎంఆర్వో సహా పలువురు అధికారులు ఏసీబీకి చిక్కిన సంఘటనలు చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా బయటపడుతున్న వ్యవహారాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన చర్యలు తప్పవని వారు అభిప్రాయ పడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

