Sitaphalmandi Murder case: ప్రేమ వ్యవహారం ఒక యువకుడి ప్రాణం తీసింది. పాతబస్తీ తరహాలో నడిరోడ్డుపై ప్రత్యర్థులు రెచ్చిపోయి, ఓ యువకుడిని కత్తులతో వేటాడి కిరాతకంగా హతమార్చారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రేమే ప్రాణసంకటమైంది..
జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) అనే యువకుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు యావన్‌ను పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ, యావన్ తన స్నేహితుడి ఇంటి వద్ద ఉంటూ తరచూ ఆ యువతిని కలుస్తూనే ఉన్నాడు.
Read Also :Ashu Reddy Case:రూ. 9.35 కోట్ల మోసం కేసులో పోలీసుల నోటీసులు!

నడిరోడ్డుపై వేటాడి..
యువతి బంధువుల్లో పెంచుకున్న కక్ష నిన్న రాత్రి ప్రతీకారంగా మారింది. మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు యావన్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి యావన్ ప్రయత్నించినా, వెంటాడి మరీ నడిరోడ్డుపై కత్తితో 17 చోట్ల పొడిచారు. తీవ్ర రక్తస్రావం కావడంతో యావన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
న్యాయం కోసం నిరసన
ఈ దారుణ హత్యతో యావన్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ యావన్ కుటుంబ సభ్యులు, బంధువులు యువతి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం సీతాఫల్‌మండి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

