Delhi Yamuna river tragedy: దేశ రాజధాని ఢిల్లీలో గుండెలు పిండేసే విషాదకర సంఘటన వెలుగుచూసింది. ఔటర్ నార్త్ జిల్లాలోని అలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హీరాంకి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం యమునా నదిలో సరదాగా స్నానానికి దిగిన నలుగురు మైనర్ బాలురు నదీ ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయారు.
ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), డీడీఎంఏ (DDMA), స్థానిక పోలీసులు ఉమ్మడిగా రంగంలోకి దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు.
Read Also: Huge Money: వావ్! తండ్రికొడుకుల బ్యాంకు ఖాతాల్లో రూ.1518 కోట్లు జమ..ఆశ్చర్యపోయిన సిబ్బంది
Four boys go missing in the Yamuna River; bodies of two recovered!
Delhi Yamuna river tragedy: ఇద్దరి మృతదేహాలు వెలికితీత
ఆదివారం సాయంత్రం నుంచి సహాయక బృందాలు నదిలో ముమ్మరంగా శోధించాయి. ఈ క్రమంలో రాత్రి వేళ ఇద్దరు బాలుర మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీశారు. అయితే, రాత్రి 10:30 గంటల సమయంలో తీవ్ర చీకటి పడటం, వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.
సోమవారం ఉదయం నుండి ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్
నదిలో గల్లంతైన మిగిలిన ఇద్దరు బాలుర ఆచూకీ కోసం సోమవారం ఉదయం నుంచే రెస్క్యూ బృందాలు మళ్లీ గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. నదిలో నీటి ప్రవాహం అత్యంత బలంగా ఉండటంతో శోధన చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. సోమవారం నాటి గాలింపులో ఇప్పటివరకు ఎలాంటి మృతదేహాలు లభ్యం కాలేదు. కాగా, నదిలో కొట్టుకుపోయి ఇంకా ఆచూకీ లభించని ఒక 15 ఏళ్ల బాలుడి తల్లి మీడియాతో మాట్లాడుతూ.. "నేను రోజువారీ పనిలో ఉన్న సమయంలో నా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి, నా కొడుకు యమునా నదిలో మునిగిపోయాడని చెప్పారు" అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది. నలుగురు చిన్నారులు నదిలో మునిగిపోవడంతో హీరాంకి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
Epaper: epaper.vaartha.com
మదురైలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఐదుగురు మృతి!

